వృథాగా పోతున్న కృష్ణా జలాలు
వృథాగా పోతున్న కృష్ణా జలాలు
Published Wed, Aug 17 2016 1:13 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
కట్టంగూర్ : మండలంలోని ముత్యాలమ్మగూడెం శివారులోని సవుళ్లగూడెం స్టేజీ వద్ద జాతీయ రహదారి పక్కనే కృష్ణా జలాలు గత రెండు నెలలుగా వృథాగా పోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచినీరు లీకవుతూ కలుషితం అవుతున్నాయి. ఉదయ సముద్రం నుంచి కట్టంగూర్ మీదుగా ముత్యాలమ్మగూడెం, దుగినవెల్లి గ్రామాలకు మూడు సంవత్సరాల కిత్రం కృష్ణాజలాల పైపులైను ఏర్పాటు చేశారు. కట్టంగూర్ నుంచి ముత్యాలమ్మగూడెం వైపు వేళ్లే పైపులైన్‌కు సవుళ్లగూడెం వద్ద నాలుగు చోట్ల రంద్రం పడటంతో నీరు పదిఫీట్ల ఎత్తులో ఎగిసిపడుతూ ఆప్రాంతం చిన్నపాటి కుంటను తలపిస్తోంది. రెండు నెలలుగా మంచినీరు వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదు. మూగజీవాలు ఆప్రాంతంలో తిరగటంతో మంచినీరు కలుషిమవుతున్నాయి. మంచినీరు సక్రమంగా సరఫరా కాక ప్రజలు అల్లాడుతుంటే అధికారులు మంచినీటి లీకేజీని అరికట్టడంలో అలసత్వం వహిస్తున్నారు. నాణ్యతలోపం కలిగిన ఇనుపపైపులు ఏర్పాటు చేయటంతో మూడేళ్లకే తుప్పుపట్టి తరుచూ రంద్రాలు ఏర్పాడుతున్నాయి. ప్రజలకు అందాల్సిన త్రాగునీరు వృథాగా పోతూ కలుషితమవుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి నూతన పైపులను ఏర్పాటు చేసి లీకేజీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Advertisement