కరీంనగర్ : బహిరంగంగా చెత్త వేస్తే రూ. 500 జరిమానా విధిస్తామని తెలంగాణ ఐటీ, మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలను ప్లాస్టిక్ ఫ్రీ, ఫ్లెక్సీ ఫ్రీ టౌన్లుగా తీర్చిదిద్దుతామని ఆయన సోమవారం కరీంనగర్లో తెలిపారు. ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక మొబైల్ యాప్ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే జూన్ 2కల్లా అక్రమ నల్లాల కనెక్షన్లను క్రమబద్దీకరిస్తామన్నారు. రూపాయికే నల్లా కనెక్షన్ అన్ని మున్సిపాలిటీల్లో అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.
పారిశుద్ధ్యం, మంచినీటి వ్యవస్థ, మెయిన్టెనెన్స్ మూడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మున్సిపాలిటీల్లో 20 అంశాల ఎజెండాను నిర్ణయిస్తామన్నారు. వచ్చే నవంబర్ 2నాటికి 20 అంశాల్లో మూడో వంత లక్ష్యం సాధించే దిశగా పనిచేస్తామన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో షీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆగస్ట్ 15లోగా మున్సిపాలిటీ లే అవుట్ స్థలాల్లో గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.