Published
Fri, Aug 5 2016 11:13 PM
| Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు
శ్రీకాకుళం సిటీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ శుక్రవారం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అధ్యక్షుడు గంగు కృష్ణారావు, ఉపాధ్యక్షుడు మామిడి క్రాంతి, పిట్టా దామోదర్‌ల ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించిన అనంతరం కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రాకు తక్షణమే ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదించారు. హైకోర్టును ఆంధ్రాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు పొన్నాడ వెంకటరమణారావు, కూన అన్నంనాయుడు, వానకృష్ణచంద్, కె.ఉషారాణి, కె.నాగభూషనరావు, విజయ్‌కుమార్, రమణారావు, ఎస్.శివన్నారాయణ, ఎ.నారాయణరావు, వి.జగన్నాథం, జె.శ్రీనివాసరావు, శశికళ, టి.మధు, మోహనరావు, ఎన్ని సూర్యారావు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.