lawers
-
తెలంగాణ హైకోర్టులో న్యాయవాదుల ఆందోళన
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో న్యాయవాదుల ఆందోళనకు దిగారు. మంగళవారం అడ్వకేట్ జనరల్ కార్యాలయం వద్ద న్యాయవాదులు చేపట్టారు. న్యాయస్థానాలలో జీపీ, ఏజీపీ, పీపీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ న్యాయవాదులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న జీపీలు, ఏజీపీలు, పీపీలు ఇంకా కొనసాగుతున్నారని న్యాయావాదులు ఆందోళన చేశారు. కుల ప్రాతిపదికన కాకుండా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వాలని లాయర్లు డిమాండ్ చేశారు. -
పాలస్తీనియన్లకు ఫ్రాన్స్ న్యాయవాది భరోసా!
ఇజ్రాయెల్- పాలస్తీనాకు చెందిన హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పేందుకు తాము అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సీనియర్ న్యాయవాది గిల్లెస్ డెవర్స్ ప్రకటించారు. అంతేకాదు.. ఈ న్యాయయుద్ధం కోసం ఆయన కేవలం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు న్యాయవాదులతో ఒక బృందాన్నీ ఏర్పాటు చేశారు. గత నెల ఏడవ తేదీన హమాస్ ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడి చేయడంతో మొదలైన యుద్ధం ఆ తరువాత మరింత తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ వైమానిక, పదాతి దళాలతో గాజా ప్రాంతంపై విరుచుకుపడుతోంది. ఫలితంగా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. ఆస్తినష్టమూ పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ యుద్ధంలో తప్పు ఎవరిదన్నవిషయంలో ప్రపంచం రెండుగా విడిపోయిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఉగ్రవాద సంస్థ హమాస్‌ను తుదముట్టించే లక్ష్యంతో తాము దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతూండగా.. హమాస్ పేరుతో తమ ప్రాణాలు పొట్టన బెట్టుకుంటున్నారని పాలస్తీనీయులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రులు, ఆంబులెన్సులపై దాడులు చేస్తూ పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ న్యాయవాది గిల్లెస్ డెవర్స్ పాలస్తీనాకు మద్దతు ప్రకటించడం, అంతర్జాతీయ న్యాయాలయాల్లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా కేసులు వేస్తామని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. గిల్లెస్ డెవర్స్ తన ప్రయత్నాలను వివరిస్తూ ఇటీవల ఒక ట్వీట్ చేశారు. అందులో పాలస్తీనాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘మిమ్మల్ని రక్షించడానికి, జాతీయ, అంతర్జాతీయ కోర్టుల ద్వారా న్యాయం అందించేందుకు తమ న్యాయ సైన్యం సిద్ధంగా ఉందని’ గిల్లెస్ ప్రకటించారు. యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెట్ భవిష్యత్తు అంధకారం కావడం గ్యారెంటీ అని ఆయన ధీమాగా చెబుతున్నారు. ఇది కూడా చదవండి: గాజాపై హమాస్ పట్టుకోల్పోయింది: ఇజ్రాయెల్ Gilles Devers is one of the most veteran lawyers in France, who in just 10 days gathered an army of lawyers from all the continents of the world to prosecute Israel for its war crimes against the Palestinians. Lawyer Giles Devers is promising the Israeli occupation with a dark… pic.twitter.com/cs8U7sz6n6 — Bhavika Kapoor ✋ (@BhavikaKapoor5) November 13, 2023 -
చర్లపల్లి జైలులో రాజాసింగ్.. పీడీ యాక్ట్ రివోక్‌పై ప్లాన్ ఫలిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్ నమోదుచేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, రాజాసింగ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. జైలులో రాజాసింగ్‌కు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలులో ఉగ్రవాద ఖైదీలున్న నేపథ్యంలో రాజాసింగ్‌ను ప్రత్యేక బ్యారెక్‌లో వసతి ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. రాజాసింగ్‌పై నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను రివోక్ చేసేందుకు ఆయన తరఫు లాయర్లు న్యాయస్థానాలను ఆశ్రయించనున్నారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, రాజాసింగ్ అరెస్ట్‌లో పీడీ యాక్ట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం కీలకంగా మారనుంది. పీడీ యాక్ట్ ప్రపోజర్స్ను అడ్వైజరీ బోర్టు కమిటీ పరిశీలించనుంది. నెలలోపు రాజాసింగ్‌ను అడ్వైజరీ కమిటీ విచారించనుంది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, నిందితుడి వివరాలను అడ్వైజరీ బోర్డు కమిటీ పరిశీలించనుంది. ఈ క్రమంలో రాజాసింగ్‌ను ఆయన లాయర్లు ములాఖత్ ద్వారా ఇప్పటికే కలిశారు. కాగా, పీడీ యాక్ట్ నమోదైన వ్యక్తులు మూడు నెలలు లేదా ఏడాది పాటు జైలులో ఉండే అవకాశం ఉంది. ఎనిమిదేళ్లలో పోలీసులు.. 2,573 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఏడాది కాలంలో 664 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు సమాచారం. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌కు తెలంగాణలో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజాసింగ్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా.. భైంసాలో శనివారం బంద్ కొనసాగుతోంది. రాజాసింగ్ అభిమానులు, హిందూ సంఘాలు.. స్వచ్ఛందంగా షాపులు, పాఠశాలలను మూసివేశారు. ఇక, భైంసాలో బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇది కూడా చదవండి: పవర్ఫుల్ పీడీ యాక్ట్.. అదే జరిగితే ఎమ్మెల్యే రాజాసింగ్ ఏడాది జైల్లోనే! -
‘జంటను కలిపిన జడ్జి’.. ఔను, వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!
తిరుపతి లీగల్ : విభేదాలతో వేరుగా జీవిస్తున్న దంపతులు న్యాయస్థానం సాక్షిగా ఒక్కటయ్యారు. సుదీర్ఘంగా న్యాయమూర్తులు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో వారి జీవితంలో వసంతం తొంగిచూసింది. ఆపై, వారిని జడ్జిలతోపాటు ప్రకృతి కూడా ఆశీర్వదించింది. జోరున కురుస్తున్న వర్షం నడుమే వారిద్దరూ కలిసి వెళ్లారు. ఈ సన్నివేశం గురువారం స్థానిక కోర్టు ఆవరణలో చోటుచేసుకుంది. వివరాలు..తిరుపతికి చెందిన టి.మునికుమారి బీఎన్.కండ్రిగకు చెందిన సలూమ్‌ను ప్రేమించి ఐదేళ్ల క్రితం మతాంతర వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇదలా ఉంచితే, తిరుపతి మండల న్యాయసేవా అధికార సంస్థ స్థానిక కోర్టు ఆవరణలో న్యాయసేవా వారోత్సవాలను నిర్వహిస్తోంది. బుధవారం ‘జంటను కలిపిన జడ్జి’ అనే వార్త సాక్షి దినపత్రికలో ప్రధానంగా వచ్చింది. ఇది చూసిన మునికుమారికి ఆశలు చిగురించాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు కోర్టుకు వచ్చింది. స్థానిక 4వ అదనపు జూనియర్ జడ్జి శ్రీనివాస్‌కు తన భర్తపై ఫిర్యాదు చేసింది. న్యాయమూర్తి స్పందించారు. సలూమ్‌ను కోర్టుకు రప్పించారు. అప్పటికి సమయం మధ్యాహ్నం 2 గంటలైంది. జడ్జితో పాటు పారాలీగల్ వలంటీర్లు ఎన్.రేవతి, ఎం.విజయలక్ష్మి సుమారు 4 గంటలకు పైగా దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పటికే కోర్టు సమయం కూడా ముగిసింది. ఆ తర్వాత వారిని 4వ అదనపు జిల్లా జడ్జి సత్యానంద్ వద్దకు తీసుకెళ్లారు. ఆ దంపతులతో ఆ జడ్జి కూడా చర్చించారు. కలసిమెలసి ఉండాలని హితబోధ చేశారు. ఇకపై భార్యాపిల్లలను బాగా చూసుకుంటానంటూ సలూమ్ న్యాయమూర్తుల సమక్షంలో హామీ పత్రం రాసి ఇచ్చాడు. చమర్చిన మునికుమారి కళ్లలో చెప్పలేనంత ఆనందం, కృతజ్ఞతా భావం. అప్పటికే సమయం సాయంత్రం 6.30 దాటింది. జడ్జిల ఆశీస్సులతో దంపతులిద్దరూ కోర్టు నుంచి వెలుపలికి వచ్చారు. జోరుగా వర్షం కురుస్తోంది. సలూమ్ తన బైక్ స్టార్ట్ చేశాడు. మునికుమారి అతడి వెనుక కూర్చుని భుజంపై చెయ్యి వేసి ఓ నవ్వు నవ్వింది. అంతే..నిమిషాల వ్యవధిలో బైక్‌లో సలూమ్ సింగాలగుంటలోని అత్తగారింట వాలిపోయాడు. సీన్ కట్ చేస్తే– తల్లితోపాటు ఇంటికి వచ్చిన తండ్రిని చూసి పిల్లలిద్దరి కళ్లలో సంభ్రమాశ్చర్యం! నాన్నొచ్చాడూ..అంటూ చెప్పలేనంత సంతోషంతో కేరింతలు కొట్టారు. -
Putta Madhu: 10 రోజుల అజ్ఞాతంపై నోరు విప్పిన పుట్టా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హైకోర్టు న్యాయ వాది వామన్‌రావు దంపతుల హత్యతో తనకెలాంటి సంబంధం లేదని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. సంబంధం లేనప్పుడు 10 రోజుల పాటు ఎందుకు పారిపోయారని ప్రశ్నించగా.. కేసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లానని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. కుంట శ్రీను, బిట్టు శ్రీను, ఇతరులు వారి వ్యక్తిగత కారణాల వల్లనే వామన్‌రావు దంపతులను హత్య చేసి ఉంటారని పేర్కొ న్నట్టు సమాచారం. దీంతో కేసు పురోగతి దిశగా పోలీసులకు ఆధారాలేమీ లభించలేదని తెలిసింది. మంగళవారం నాలుగో రోజు మధు దంపతులను గంటన్నరపాటు విచారించిన పోలీసులు తిరిగి పంపించేశారు. తామెప్పుడు పిలిచినా హాజరు కావాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వేర్వేరు వాహనాల్లో వచ్చిన మధు, ఆయన భార్య శైలజను పోలీసులు వేర్వేరుగానే విచారించారు. ఈ కేసులో వీరి ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఓ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. 34 ఖాతాల పరిశీలన పూర్తి ఈ కేసుకు సంబంధించి పలువురి బ్యాంకు ఖాతాలను 4 రోజులుగా పరిశీలించిన పోలీసులు.. అనుమానాలకు తావిచ్చే స్థాయిలో లావాదేవీలు లేవని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. మొత్తం 39 ఖాతాల ను పరిశీలించాల్సి ఉండగా.. ఇంకా 5 ఖాతాల సమాచారం రావలసి ఉందని ఓ అధికారి తెలిపారు. దీంతో మరో 3 రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్లేందుకు అనుమతి పుట్ట మధును ఈనెల 8న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం నుంచి రామగుండం తీసుకువచ్చినట్లు ప్రకటించిన పోలీసులు.. సోమవా రం రాత్రి వరకు కమిషనరేట్‌లోనే ఉంచి విచారించారు. తర్వాత ఇంటికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. రాత్రి 11 గంటల తర్వాత మంథని వచ్చిన మధుకు నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్శిణి, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్రఘువీర్సింగ్, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఆయన నివాసానికి వచ్చి కలిశారు. చదవండి: Etelaకు చెక్.. టీఆర్ఎస్ భావి నేతగా తెరపైకి కౌశిక్ రెడ్డి! -
లాయర్ల హత్య: ‘అప్పటి ఆరోగ్య మంత్రిపై అనుమానం’
సాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ రాష్ట్రం భీమవరంలో ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్న మధును తాము అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ కోసం శనివారం ఆయనను రామగుండం తీసుకొచ్చారు. వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు గతనెల 16న ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదులో పుట్ట మధు ప్రమేయంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘నా కొడుకు, కోడల్ని కత్తులతో పొడిచిన తరువాత పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో వారికి సకాలంలో వైద్య సేవలు అందలేదు. దీనికి అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కారణమని నాకు అనుమానం. మొదట ప్రైవేటు అంబులెన్స్ వచ్చినప్పటికీ దాన్ని కాదని 108 వాహనం వచ్చే దాకా కావాలనే ఆలస్యం చేశారు. ఆస్పత్రికి చేరిన తర్వాత తీవ్ర గాయాలతో ఉన్న వామన్‌రావుకు వైద్య సేవలు సకాలంలో అంది ఉంటే కొద్ది రోజులైనా బతికేవాడు’ అని తెలిపారు. ‘పుట్ట మధుకు, ఈటలకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే నా కుమారుడికి వైద్య సేవలు అందలేదు. పంచనామా పోస్టుమార్టం రిపోర్టు విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి. పెద్దపల్లి ప్రజాప్రతినిధి కూడా ఆసుపత్రికి వచ్చిన వామన్‌రావుకు మందులు ఇవ్వవద్దని చెప్పారు. నిందితులందరికీ చట్ట పరంగా శిక్షలు పడతాయనే విశ్వాసం ఉంది. మధు, ఆయన భార్య శైలజ, రామగిరికి చెందిన సత్యనారాయణ ప్రమేయం ఉన్నట్లు ఏప్రిల్ 16న ఐజీ నాగిరెడ్డికి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు పంపా. హత్యకు రెక్కీ నిర్వహించడం, అందులో పాల్గొన్న వ్యక్తి పేరును ఇతర వివరాలు తెలియజేశా. వీరందరినీ విచారిస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి. న్యాయం జరగకపోతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తా’ అని తెలిపారు. చదవండి: వామన్‌రావు దంపతుల హత్య కేసుపై సర్కారు ఫోకస్ -
వారంలో ఐదు హత్యలు: కారణమేదైనా కడతేర్చుడే!
సాక్షి, జగిత్యాల: అనుమానం, ఇంట్లో గొడవ, ఆర్థిక పరమైన అంశాలు, మంత్రాలు, పాత కక్షలు.. కారణమేదైనా ఎదుటి మనిషిని చంపడమే పరిష్కారమని పలువురు అనుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత వారం రోజుల వ్యవధిలో ఐదుగురు హత్యకు గురవడం కలకలం సృష్టిస్తోంది. వరుసగా చోటుచేసుకుంటున్న హత్యోదంతాలు తాజా మానవ సంబంధాలకు అద్దం పడుతున్నాయి. మనుషుల్లో సున్నితత్వం లోపించడం, కక్షపూరిత ధోరణి పెరగడం వల్లే హత్యలు జరుగుతున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదని పేర్కొంటున్నారు. హంతకులను పట్టుకొని, తక్షణమే శిక్షించడం ద్వారా ఇలాంటి ఘోరాలు తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వరుస హత్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. భర్తను హతమార్చిన భార్య.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన ఒడ్నాల రాజగంగారాం (45) అతని భార్య భాగ్యలక్ష్మి చేతిలోనే ఈ నెల 18న హత్యకు గురయ్యాడు. రాజగంగారాం నిత్యం మద్యం సేవించి, అనుమానంతో తన భార్యను వేధించేవాడు. గత గురువారం తెల్లవారుజామున ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆమె తనను తాను కాపాడుకునేందుకు భర్తను కత్తెరతో పొడిచి, తలపై రోకలి బండతో మోదడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మంత్రాల నెపంతో వ్యక్తి హత్య.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్ శివారులో ఈ నెల 19న మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం గూడెంకు చెందిన సూర దుర్గయ్య (55) దారుణ హత్యకు గురయ్యాడు. మంత్రాలు చే స్తున్నాడనే నెపంతో స్థానికులే అతన్ని చంపినట్లు నిర్ధారణకు వచ్చామని పోలీసులు తెలిపారు. మద్య ం తాగించేందుకు బైక్‌పై తీసుకెళ్లి, తలపై బండతో కొట్టడంతో ప్రాణాలు విడిచాడన్నారు. క్షణికావేశంలో దారుణాలు.. కుటుంబ కలహాలు, అనుమానం, ఆవేశంతో కట్టుకున్న భార్యలను కడతేర్చేందుకు కూడా కొందరు భర్తలు వెనకాడటం లేదు. తాగుడుకు బానిసై చిన్న చిన్న గొడవలనే పెద్దవి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మాటామాట పెరిగి, క్షణికావేశంలో కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. పాత కక్షలు, భూ వివాదాలను మనసులో పెట్టుకొని, బహిరంగంగానే హత్యలకు పాల్పడుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు. నేరం చేసిన వారిని వెంటనే శిక్షించేలా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. నడిరోడ్డు పైనే దారుణం... ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, వెంకటనాగమణి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హంతకులు కత్తులతో ఘాతుకానికి పాల్పడటం కలకలం రేపింది. కళ్లముందే కత్తులతో దాడి చేస్తున్నప్పటికీ చుట్టూ ఉన్నవారు మిన్నకుండి పోయారు. ఆ సమయంలో ఎవరైనా స్పందించినా ప్రాణాలు దక్కే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. కళ్లముందు దారుణం జరుగుతున్నప్పటికీ మనకెందుకులే అన్న (బైస్టాండెడ్ అపతి) స్థి తిలో ప్రత్యక్ష సాక్ష్యులు ఉండిపోయారని మానసిక నిపుణులు అంటున్నారు. సమాజంలో ఈ పరిస్థితి ప్రమాదకరమని చెబుతున్నారు. మనుషుల్లో సున్నితత్వం లోపిస్తోంది.. నేటి సమాజంలో మానవ సంబంధాలు క్రమంగా దిగజారుతున్నాయి. మనుషుల్లో సున్నితత్వం లోపిస్తున్న కారణంగా నేరం చేయడం తప్పుకాదన్న భావన పెరుగుతోంది. క్షణికావేశం, పాత కక్షలు, సహనం కోల్పోవడం కారణంగా హత్యలు జరుగుతున్నాయి. హంతకులకు త్వరితగతిన శిక్షలు అమలు చేస్తే కొంతవరకు నేర ప్రవృత్తి తగ్గే అవకాశం ఉంది. పాఠశాల స్థాయి నుంచే నైతిక విలువల బోధన సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గౌతమ్, సైకాలజిస్ట్ దోషులకు త్వరగా శిక్ష పడాలి.. ఇటీవల జరిగిన వరుస హత్యలను పరిశీలిస్తే ఆవేశాలు, అనుమానాలతోనే చేసినట్లు స్పష్టమవుతోంది. ఉద్ధేశపూర్వకంగా చేసే ఇలాంటి నేరాలపై కోర్టులు త్వరితగతిన విచారణ చేపట్టాలి. నేరారోపణ రుజువైన వెంటనే దోషులకు కఠిన శిక్షలు విధించాలి. ప్రభుత్వ యంత్రాంగం సైతం ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. – బండ భాస్కర్‌రెడ్డి, న్యాయవాది, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు, జగిత్యాల చదవండి: కీలకంగా మారిన బిట్టు.. మధుపై అనుమానం! న్యాయవాదుల హత్య: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వామన్‌రావు హత్య కేసులో కీలక విషయాలు -
న్యాయవాదుల హత్య: ఆ కేసులే కారణమా?
సాక్షి, కరీంనగర్/మంథని: ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు... అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కత్తులతో వీరంగం... కారులో వెళ్తున్న న్యాయవాది గట్టు వామన్‌రావు, అతని భార్య నాగమణిపై దాడి.. ప్రాణాలతో కారు నుంచి బయటపడ్డ వామన్‌రావును ఆర్టీసీ బస్సుల పక్కన రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో విచక్షణారహితంగా నరికివేత. ఈ దృశ్యాలను వీడియోలుగా తీసిన కొందరు యువకులు... బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద జరిగిన న్యాయవాద దంపతుల హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పట్టపగలు కారులో వెళ్తున్న న్యాయవాద దంపతులను అడ్డగించి కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపిన సంఘటన మంథని ప్రాంతంలోనే గాక ఉమ్మడి జిల్లాను ఉలికిపాటుకు గురి చేసింది. సొంత గ్రామానికి చెందిన వ్యక్తులు నడిరోడ్డుపై కాపు కాసి హత్య చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ జిల్లాల్లో ఈ తరహా హత్య జరగడం అరుదుగానే పోలీసులు కూడా ఒప్పుకుంటున్నారు. ఫ్యాక్షన్ తరహాలోనే దాడి.. రాష్ట్రంలో గతంలో ఎక్కడా లేని విధంగా ఫ్యాక్షన్ తరహాలో మంథని మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ న్యాయవాద దంపతులపై పక్కా ప్రణాళికతో దాడి చేసి చంపడం చర్చనీయాంశంగా మారింది. వందలాది వాహనాల రాకపోకలతో ఎప్పుడూ బిజీగా ఉండే మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపైనే జనమంతా చూస్తుండగానే ఈ జంట హత్యలు జరిగాయంటే ఆశ్చర్యం వేయక మానదు. కారులో ప్రయాణిస్తున్న దంపతులను చంపాలనే లక్ష్యంతో నిందితులు చేసిన దాడిలో మహిళా న్యాయవాది నాగమణి కారులోనే ప్రాణాలు కోల్పోగా, వామనరావును రోడ్డుపై కత్తులతో నరుకుతున్నా పట్టించుకునే వారే కరువుయ్యారు. దుండగులు దాడి చేసే సమయంలో వారి వెనకాలే ఓ ఆర్టీసీ బస్సు నిలిచి ఉన్న దృశ్యాలు రోడ్డుపై నిలబడ్డ వ్యక్తులు తీసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. విలపిస్తున్న వామన్‌రావు తల్లిదండ్రులు అలాగే మరో బస్సు దాడులు చేస్తున్న సమయంలోనే వస్తుండడంతోపాటు ద్విచక్రవాహనదారులు సైతం హత్యాకాండను చూసుకుంటూ వెళ్లారే తప్ప అడ్డుకునే ఏ ప్రయత్నం చేయలేదు. వాహనంలో గట్టు నాగమణిపై దాడి అనంతరం వామన్‌రావుపై దాడి చేసే దశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. హంతకులు వెళ్లిపోయిన తరువాత వామన్‌రావు శరీరం నుంచి రక్తం వస్తూ చివరి ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా... స్థానికులు అతని వివరాలు సేకరిస్తూ వీడియో తీశారే తప్ప సాయం అందించే ప్రయత్నం చేయలేకపోయారు. తాగడానికి నీళ్లివ్వమని అడగడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. నీళ్లు ఇస్తే ప్రమాదమనే కారణం చెబుతూ అతని వివరాలు సేకరించారు. అయితే వామన్‌రావు తనపై దాడి చేసిన వ్యక్తి కుంట శ్రీనివాస్ అని చెప్పడం ఇప్పుడు కేసులో నిందితులను పట్టుకోవడానికి ఉపయోగపడింది. వివాదాస్పద కేసులతో కంట్లో నలుసుగా వామన్‌రావు మొదటి నుంచి వివాదాస్పద కేసులు వాదిస్తూ పలువురికి కంట్లో నలుసుగా మారాడు. పెద్దపల్లి జిల్లాలోనే కాకుండా మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం అనేక కేసులు ఇరువురు దంపతులు వాదిస్తుంటారు. మంథని మండలం గుంజపడుగు గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగ పరుస్తున్నారే విషయంపై అప్పటి పెద్దపల్లి కలెక్టర్ దేవసేనతోపాటు జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్, జిల్లా అధికారులపై హైకోర్టులో దాఖలు చేసిన కేసులు అప్పట్లో చర్చనీయాంశం. పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అక్రమ ఆస్తులు కూడబెట్టారనే కేసు ఆయన పదవికే గండం తెచ్చింది. పుట్ట మధుపై ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆయేషా అనే అభ్యర్థి పుట్ట శైలజపై వేసిన కేసును సైతం వామన్‌రావు వాధిస్తున్నారు. మంథని పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ శీలం రంగయ్య కేసులో హైకోర్టులో పిల్ వేసి ప్రధాన న్యాయమూర్తి దృష్టిని ఆకర్షించారు. వామన్‌రావు దంపతులపై బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు అట్రాసిటీ, ఛీటింగ్ కేసులు నమోదు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోలీసులు పెట్టిన కేసును కూడా హైకోర్టులో సవాల్ చేసి పోలీసులకు నలుసుగా మారారు. శీలం రంగయ్య లాకప్‌డెత్ కేసులో తాను హైకోర్టును ఆశ్రయించడం వల్లనే పోలీసులు తనను వేధిస్తున్నారని ప్రధాన న్యాయమూర్తికి తెలపడం గమనార్హం. రంగయ్య కేసు విచారణ పూర్తి అయ్యే వరకు వామన్‌రావు దంపతులను తెలంగాణ రాష్ట్రంలోని ఏ పోలీస్‌స్టేషన్‌కు పిలవకూడదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయగా... ఆ ఉత్వర్తులను మరో నాలుగు వారాలు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ఇటీవల వెల్లడించింది. పెద్దపల్లికి తరలిన రాజకీయ నేతలు హత్య విషయం దావానంలా వ్యాపించడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి గుంజపడుగు గ్రామస్తులు, రాజకీయ నాయకులు చేరుకున్నారు. ఈ హత్యలో ప్రధానంగా కుంట శ్రీనుతోపాటు అదే గ్రామానికి అక్కపాక కుమార్, వసంతరావ్ల హస్తం ఉన్నట్లు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేసారు. రాజకీయాలు సైతం ముఖ్య పాత్ర పోషించినట్లు కొందరు నాయకులు నేరుగా ఆరోపిస్తున్నారు. పోలీసుల వైఫల్యం వల్లే దంపతుల హత్య జరిగిందని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంఎల్సీ జీవన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వామన్ కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిసి కూడా ఎందుకు రక్షణ కల్పించలేదని, పోలీసులకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేస్తున్నాడనే కక్షతోనే ఇలా వ్యవహరించారని వారు పేర్కొన్నారు. న్యాయవాదుల హత్య వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉందని, పూర్తిస్థాయిలో వి చార ణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల తప్పుడు పనులను ప్రశ్నించినందుకే దారుణంగా చంపించారని పలు పార్టీల నాయకులు ఆరోపించారు. హైకోర్టు న్యాయవాదుల హత్యలకు నిరసనగా కోర్టుల బంద్ నిర్వహించాలని పలు బార్ అసోసియేషన్లు తీర్మానాలు చేశారు. సోషల్‌మీడియాలో వీరి హత్య సంఘటనలు పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతున్నాయి. ముగ్గురిపై కేసు నమోదు న్యాయవాద దంపతుల హత్యపై పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్, వసంతరావులపై వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేశారు. కాగా ప్రధాన నిందితుల్లో ఒకడైన అక్కపాక కుమార్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు కమిషనర్ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. హత్య చేసి తప్పించుకొన్న ఇద్దరిలో ఒక్కరే తమ అదుపులో ఉన్నట్లు చెప్పడం గమనార్హం. ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ విషయం గురువారం తెలిసే అవకాశం ఉంది. సీఎం పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని... గట్టు వామనరావు దంపతులను హత్య చేసిన కేసులో ప్రథమ నిందితుడు కుంట శ్రీనివాస్ బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం గమనార్హం. ఉదయం మంథనిలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి సీఎం జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో హత్య జరిగిందంటే వేడుకల తరువాతే అక్కడికి వెళ్లి ఉంటాడనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
చంద్రబాబు అవినీతిపై సీబీఐ ఈడీలతో దర్యాప్తు చేయాలి
-
చంద్రబాబుపై మండిపడ్డ రాయలసీమ న్యాయవాదులు
-
జూనియర్ లాయర్లకు నెలకు రూ.5 వేలు
సాక్షి, అమరావతి: మరో ఎన్నికల హామీ అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూనియర్ లాయర్ల (అడ్వకేట్)కు నెలకు రూ.5000 చొప్పున స్టైఫండ్ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ హామీని వచ్చే నెల 2వ తేదీన పూర్తి స్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలకు ఆయన ఆమోదం తెలిపారు. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరత్వం పొందే వరకు అంటే మూడేళ్ల పాటు నెలకు 5000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీవోను ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం జారీ చేయనుంది. అర్హులైన జూనియర్ అడ్వకేట్స్‌కు వచ్చే నెల 2వ తేదీన నిర్దేశించిన బ్యాంకు అకౌంట్లలో ఆ మేరకు నగదు జమ చేయనున్నారు. ఆ మరుసటి రోజు అంటే వచ్చే నెల 3వ తేదీన లబ్ధిదారులకు నగదు జమకు సంబంధించిన రశీదులతో పాటు ముఖ్యమంత్రి సందేశాన్ని వలంటీర్లు డోర్ డెలివరీ చేయనున్నారు. దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామ, వార్డు వలంటీర్లకు పంపిస్తారు. తనిఖీల అనంతరం అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలకు పంపుతారు. వారు పరిశీలించాక జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపుతారు. అర్హులైన వారి వివరాలను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఉంచుతారు. అర్హులైన జాబితాలను సామాజిక తనిఖీ నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. దరఖాస్తు దారు లా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి. దరఖాస్తుదారు పేరు రాష్ట్ర బార్ కౌన్సిల్ సెక్షన్ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్‌లో నమోదై ఉండాలి. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. న్యాయవాద చట్టం 1961 సెక్షన్ 22 ప్రకారం రోల్లో నమోదైన తొలి మూడేళ్ల ప్రాక్టీసు సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. జీవో జారీ అయ్యే నాటికి జూనియర్ లాయర్లు ప్రాక్టీసు ప్రారంభించి తొలి మూడేళ్లు పూర్తి కాకపోతే మిగిలిన సంవత్సరాలకు స్టైఫండ్‌కు అర్హులు. 15 ఏళ్ల ప్రాక్టీసు అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాదులు లేదా సంబంధిత బార్ అసోసియేషన్ నుంచి ధృవీకరణ పత్రంతో ప్రాక్టీసులో క్రియాశీలకంగా ఉన్నట్లు ప్రతి ఆరు నెలలకు జూనియర్ అడ్వకేట్స్ అఫిడవిట్‌ను సమర్పించాలి. న్యాయవాద వృత్తి నుంచి వైదొలిగినా, ఏదైనా మెరుగైన ఉద్యోగం వచ్చినా.. ఆ వివరాలను ఆన్లైన్ ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేయాలి. బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న తర్వాత రెండేళ్ల వరకు వారి సర్టిఫికెట్లు బార్ కౌన్సిల్లో ఉంచాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తింప చేస్తారు. కుటుంబం అంటే భర్త, భార్య, మైనర్ పిల్లలు. ప్రతి దరఖాస్తు దారు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. జీవో జారీ చేసేనాటికి జూనియర్ న్యాయవాది 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి. జీవో జారీ అయ్యే నాటికి తొలి మూడేళ్ల ప్రాక్టీసు పూర్తి అయి ఉంటే అనర్హులు జూనియర్ న్యాయవాది పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు నాన్ ప్రాక్టీసు న్యాయవాదులు అనర్హులు అర్హులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లా డిగ్రీతో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయాలి. సీనియర్ న్యాయవాది ధృవీకరణతో బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయినట్లు అఫిడవిట్ అప్లోడ్ చేయాలి. దరఖాస్తుతో పాటు ఆధార్ నంబర్‌ను పొందుపరచాలి. దరఖాస్తు దారు నిర్దేశిత బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయాలి. -
స్త్రీసెవంటీసెవన్
కోరలు ఉన్నప్పుడు అది సెక్షన్ 377. కోరలు తీసేశాక స్త్రీసెవంటీసెవన్. అవును! ఈ చరిత్రాత్మక కేసును గెలిచిన బృందంలోని సారథ్య స్త్రీకి ఈ క్రెడిట్‌ను ఇవ్వాల్సిందే. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 377 తలవంచింది. ఇంద్రధనుస్సు జెండా రెపరెపలాడింది! ఈ న్యాయ పోరాటాన్నే కాదు, ఎల్జీబీటీల మనసుల్నీ గెలిచిన ధీర వనిత మేనకా గురుస్వామి. కేసును వాదించి గెలిపించిన ఆల్ మెన్ లాయర్స్ టీమ్‌లో ఒకే ఒక్క మహిళ! మనుషులంతా సమానమే అని నమ్మే ప్రతి ఒక్కరి ప్రశంసలూ అందుకుంటున్న ఈ మానవీయ న్యాయవాది గురించి తెలుసుకోవలసింది ఎంతో ఉంది. మేనక హైదరాబాద్‌లో పుట్టింది. ఢిల్లీలో పెరిగింది. చదరంగం ఆటంటే చాలా ఇష్టం ఆమెకు. లా చదువుతున్నప్పుడే ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్ కావాలనుకుంది. టీన్స్‌లో ఉన్నప్పుడు.. పాప్ సింగర్ మడోన్నాకు బ్యాకప్ సింగర్ కావాలని పాటలు, డాన్స్ ప్రాక్టీస్ చేసేదట. ‘‘నీకంత టాలెంట్ లేదు ఆపు’’ అంటూ కజిన్స్ ఆమె ఆశల మీద నీళ్లు పోశారు. ‘‘సన్నగా ఉన్న నేను స్టెప్పులేస్తుంటే.. స్కెలిటన్ డాన్స్ చేస్తున్నట్టుంది అంటూ నవ్వేవాళ్లు నా కజిన్స్, ఫ్రెండ్స్’’ అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటుంది మేనక. మైండ్‌లో ఫిక్సైపోయింది మేనకకు పుస్తకాలు చదవడమంటే చిన్నప్పటి నుంచీ ఆసక్తి. ప్రముఖ రచయిత జేమ్స్ బాల్డ్విన్ చెప్పిన ‘‘ఎదురైన ప్రతి పరిస్థితీ మారకపోవచ్చు.. కాని పరిస్థితులను ఎదుర్కోనిదే ఏ మార్పూ సాధ్యంకాదు’’ అనే మాటలను మైండ్‌లో ఫిక్స్ చేసుకుంది. అందుకే మడోన్నా, చెస్లను ఛస్ అనుకొని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీలో బిఏ ఎల్ఎల్బీ చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ వెళ్లి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బీసీఎల్, హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్మ్ పట్టా పుచ్చుకుంది. అంతకన్నా విశేషం మేనకా రోడ్స్ (ఖజిౌఛ్ఛీట) స్కాలర్. ఆక్స్‌ఫర్డ్‌లోని రోడ్స్ (ఖజిౌఛ్ఛీట) హౌజ్‌లోని మిల్నర్ హాల్లో ఆమె చిత్రపటాన్ని కొలువుదీశారు. ఈ అరుదైన గౌరవం దక్కిన తొలి భారతీయ మహిళ ఆమే. ఆక్స్‌ఫర్డ్‌లో సివిల్ లా చదువుతున్నప్పుడు ఆ హాల్ వెంట నడుస్తూ చాలాసార్లు అనుకునేదట.. ఎందుకు ఈ హాల్లో నాలాంటి ఒక్క మహిళా పోట్రైట్ కనిపించదు? అని. ఆ టైమ్‌లో మేనక కనీసం ఊహించి కూడా ఉండదు తర్వాత కాలంలో తన పోట్రైటే అక్కడ ఉంటుందని. ధారపోసేందుకే తిరిగి రాక లా చదువుతున్నప్పడే ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నిటినీ అధ్యయనం చేసింది మేనక. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న విషయాన్నీ గ్రహించింది. న్యాయశాస్త్రం చదివాక అమెరికా వెళ్లింది. న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా లో ఫ్యాకల్టీగా న్యాయశాస్త్రం బోధిస్తూనే ఇంకోవైపు యునైటెడ్ నేషన్స్‌కి హ్యూమన్‌రైట్స్ కన్సల్టెంట్‌గా పనిచేసింది. క్షణం తీరికలేకుండా అమెరికాలో బిజీగా ఉంది కాని మేనక మనసంతా ఇండియాలోనే. ఎందుకంటే ఆమెకు కాన్స్టిట్యూషనల్ లా.. ముఖ్యంగా ఇండియన్ కాన్స్టిట్యూషనల్ లా అంటే ప్రాణం. రాజ్యాంగం కల్పించే హక్కుల పరిరక్షణ కోసమే తన కెరీర్‌ను ధారపోయాలనుకుంది అందుకే భారతదేశానికి తిరిగొచ్చేసింది. సుప్రీంకోర్ట్ అడ్వొకేట్‌గా ఢిల్లీలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. తొలి యుద్ధం.. విద్యహక్కు కోసం రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఎన్ని దుర్వినియోగ మవుతున్నాయో తెలుసుకుంది మేనక. వాటి పోరుకి సిద్ధపడింది. అలాంటి వాటిల్లో ఆమె ఎక్కుపెట్టిన తొలి అస్త్రం రైట్ టు ఎడ్యుకేషన్. పేద పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో సీట్లు ఇవ్వాలనే నియమం వచ్చింది మేనక వల్లే. ‘‘అయితే ఇప్పటికీ చాలాచోట్ల ప్రైవేట్ స్కూళ్లు ఆ రూల్‌ని అమలు చేయట్లేదు. పేద పిల్లలకు సీట్ ఇవ్వాల్సి వస్తుందని తమ స్కూళ్లను మైనారిటీ స్కూళ్లుగా మార్చేసుకున్న వాళ్లూ ఉన్నారు. దీని మీద ఇంకా వర్క్ చేయాలి’’ అంటుంది ఆమె. వృత్తి పట్ల అంత నిబద్ధత మేనకకు. తన 20 ఏళ్ల కెరీర్లో విజయం సాధించిన కేసులెన్నో. ఇప్పుడీ.. సెక్షన్ 377 వలస పాలకులు తమ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న కొన్ని చట్టాలంటే మేనకా గురుస్వామికి గుర్రు. కాలం చెల్లిన ఆ చట్టాల్లో సెక్షన్ 377 ఒకటి. కాదు.. ముఖ్యమైనది. దాని ప్రకారం సమానత్వపు హక్కుకు దూరమై సమాజం దృష్టిలో హేళనకు గురవుతున్న ఎల్జీబీటీ కమ్యూనిటీకి అండగా నిలిచింది. వాళ్లు చేస్తున్న పోరాటానికి న్యాయ సహాయం అందిస్తున్న బృందంలో ఏకైక మహిళగా ముందుంది. వాళ్లకు మద్దతుగా వాదించింది. పర్యవసానమే.. మొన్న, ‘హోమోసెక్సువాలిటీ నేరం కాదు’ అంటూ సుప్రీంకోర్టు సెక్షన్ 377ను çసడలించడం. అది ఎల్జీబీటీలకు మేనక అందించిన గెలుపు. ఎల్జీబీటీ కమ్యూనిటీ కూడా మానవ సమూహమే.. వాళ్లకు గౌరవం అందాలని వాదించింది ఆమె. ప్రయాణాలు అంటే ప్రాణం నేపాల్ వంటి దేశాల రాజ్యాంగ రచనలో సహకారం అందించిన మేనకా యేల్ వంటి యూనివర్సిటీల్లో గెస్ట్ ప్రొఫెసర్‌గా న్యాయ పాఠాలు చెప్పేందుకు వెళుతుంటారు. ట్రావెలింగ్ ఆమె అభిరుచి. వియాన్నా, కేప్ టౌన్, టోక్యో, న్యూయార్క్ ఆమె ఫేవరేట్ ప్లేసెస్. ప్రపంచంలోని ప్రతి మూలా చుట్టి రావాలని ఆమె సంకల్పం. కొత్త కొత్త ప్రదేశాలను అన్వేషించడం అంటే ఇష్టం. ‘‘వృత్తిలో భాగంగా చాలా దేశాలు, ఊళ్లూ తిరుగుతాను. కానీ ఢిల్లీ అంటే పడి చచ్చిపోతా. చలికాలం రాత్రుళ్లు ఇక్కడి చారిత్రక కట్టడాలను చూస్తూ ఆ పేవ్మెంట్స్ మీద నడవడమంటే పిచ్చి సరదా. అసలు నన్ను ఈ దేశానికి రప్పించిన రీజన్స్‌లో ఇదీ ఒకటి కావచ్చు’’ అంటుంది. బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్? అని అడిగితే.. ‘‘న్యాయమైన తీర్పులో భాగమైనవన్నీ. అఫ్కోర్స్ అలాంటి సందర్భాలు తక్కువే కావచ్చు.. కానీ ఉంటాయి. అలాంటి తీర్పు వచ్చినప్పుడల్లా సంతోషంగా ఉంటుంది’’ అని చెప్తుంది మేనక. ‘‘లా .. వండర్ఫుల్ ప్రొఫెషన్. కాని ఈ దేశంలో ఓ మహిళగా.... మహిళా లాయర్‌గా.. నీ మనసు ఏం చెబుతుందో అదే వినాలి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. లేకపోతే ‘‘ఆడపిల్లవు.. నువ్వేం చేయగలవు.. నీకు ఇది అవసరమా’’ అంటూ అనుక్షణం వెనక్కిలాగే ఈ సొసైటీని జయించలేం. మన మీద మనకు నమ్మకం చాలా ఉండాలి.. అప్పుడే ఇలాంటివన్నీ ఓవర్‌కమ్ చేయగలం’’ అని తాను ఆచరించే సత్యాన్ని బయటపెట్టింది మేనకా గురుస్వామి. – శరాది -
‘ఖమ్మం బార్’ ను ఎప్పటికీ మరువను
సాక్షి, ఖమ్మం లీగల్ : ఖమ్మం జిల్లాతో, ఖమ్మం బార్‌తో తనకు విడదీయలేని బంధం ఉందని, ఖమ్మం బార్‌ను ఎన్నటికీ మరువనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామచందర్‌రావు మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతర విద్యార్థులని, ప్రతి క్షణం విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. గతంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తనను విశేషంగా ఆదరించి.. తన విజయానికి సహకరించారని పేర్కొన్నారు. బార్, గ్రంథాలయ అభివృద్ధి కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారికి ప్రత్యేక విజ్ఞప్తి చేసి రూ.లక్ష మంజూరు చేయించడమే కాకుండా చెక్కును బార్‌కు అందజేసినట్లు తెలిపారు. అనంతరం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఎన్.రామచందర్రావును బార్ అసోసియేషన్ ఈపీ, సీనియర్ న్యాయవాదులు ఘనంగా సన్మానించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు పసుమర్తి లలిత, ప్రధాన కార్యదర్శి కూరపాటి శేఖర్‌రాజు, పూసా కిరణ్, మర్రి ప్రకాష్, పబ్బతి రామబ్రహ్మం, సీనియర్ న్యాయవాదులు జి.సత్యప్రసాద్, మలీదు నాగేశ్వరరావు, వెంకట్‌గుప్తా, తల్లాకుల రమేశ్, రామసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
సెటిల్మెంట్లు చేస్తే చర్యలు తప్పవు
హోం మంత్రి రాజప్ప హెచ్చరిక అమలాపురం టౌన్ : న్యాయవాద వృత్తి చేస్తూ కొందరు భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని, అలాంటి న్యాయవాదులను ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. సెటిల్మెంట్లు, భూ కబ్జాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే న్యాయవాదులపై కేసులు నమోదు చేసి జైళ్లకు కూడా పంపుతామని స్పష్టం చేశారు. అమలాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అసోసియేషన్ కార్యాలయ ప్రాంగణంలో పలువురు ప్రజాప్రతినిధులకు ఆదివారం జరిగిన సత్కార సభకు రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అమలాపురం బార్ అసోసియేషన్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడ న్యాయవాదులుగా పనిచేసి నేడు న్యాయమూర్తులుగా అనేక మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని రాజప్ప గుర్తు చేశారు. అలాంటి అమలాపురంలో కొంత మంది న్యాయవాదులు సెటిల్మెంట్లు, భూకబ్జాలకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అమలాపురంలో రౌడీయిజాన్ని అణిచివేశాం, తప్పు ఎవరు చేసినా క్షమించేది లేదన్నారు. రాష్ట్రంలో సెటిల్మెంట్లు, భూ కబ్జాలకు ముఖ్యంగా నకిలీ డాక్యుమెంట్లు... నకిలీ రిజస్ట్రేషన్లతో ప్రజలను మోసగిస్తే పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతుందన్నారు. విశాఖపట్నంలో ఈ తరహాలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి అణిచివేతకు గతంలో అమలాపురం డీఎస్పీగా పనిచేసిన ప్రస్తుత విశాఖ సీపీ టి.యోగానంద్ ప్రత్యేక దర్యాప్తు, విచారణతో అలాంటి నేరాలను అదపు చేస్తున్నారని రాజప్ప గుర్తు చేశారు. బార్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. అందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. పేదలకు ఉచిత న్యాయం అందించాలని ఆయన ఆకాంక్షించారు. వాస్తవంగా తప్పులు చేసిన వారికి శిక్ష పడేలా న్యాయవాదులు పనిచేయాలని రాజప్ప సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజప్పను అసోసియేషన్ తరపున ఘనంగా సత్కరించారు. ఆయనతోపాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, రాజోలు, అమలాపురం ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావు, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్సీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యం అప్పనపల్లి (మామిడికుదురు) : టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. రాజప్ప దంపతులు ఆదివారం అప్పనపల్లి శ్రీబాలబాలాజీస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో విజయవాడ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ఆలయాలను మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐఏఎస్ అధికారులకు అక్కడ నియమించామన్నారు. జిల్లాలో వాడపల్లి, అప్పనపల్లి పుణ్య క్షేత్రాలను కూడా అభివృద్ధి చేయడంతో పాటు స్థానికంగా ఉన్న వనరులను వినియోగించుకుని వీటిని టెంపుల్ టూరిజం కేంద్రాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు.లంక గ్రామాలు ముంపు బారిన పడకుండా ఉండేందుకు కాజ్‌వేల ఎత్తు పెంచేలా కార్యాచరణ చేపట్టామన్నారు. తీర గ్రామాలకు సాగునీరు అందించే అప్పనపల్లి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా కోటిపల్లి నదిపై వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. ఈ సీజన్లోనే పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని రాజప్ప తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో 20 ఎకరాల విస్తీర్ణంలో అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పలువురు పార్టీ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. -
పన్నీర్ సెల్వంకు పెరుగుతున్న మద్దతు
-
న్యాయవాదుల నిరసన
అలంపూర్: జోగుళాంబ జిల్లా పేరుతో గద్వాలను జిల్లాకేంద్రం చేయాలని చేపట్టిన 72 గంటల బంద్ శుక్రవారం సంపూర్ణంగా కొనసాగింది. అఖిలపక్ష కమిటీ పిలుపు మేరకు పట్టణంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు, వ్యాపారదుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించారు. అన్ని వసతులు ఉ్న గద్వాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంలో న్యాయవాదులు రాజేశ్వరి, సురేష్ కుమార్, తిమ్మారెడ్డి, నాగరాజు యాదవ్, మహేష్ యాదవ్, మహేష్ ఉన్నారు. -
న్యాయవాదులకు ఇండోర్‌గేమ్స్
కోరుట్ల : పట్టణంలోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం గణతంత్య్ర దినోత్సవం కోసం న్యాయవాదులకు ఇండోర్ గేమ్స్ పోటీలు నిర్వహించారు. న్యాయవాదులు క్యారం బోర్డు పోటీల్లో పాల్గొన్నారు. న్యాయవాదులు బోయిని సత్యనారాయణ, బైరి విజయ్, కట్కం రాజేశ్, బద్ది నర్సయ్య, చెన్న విశ్వనాథం, బీమనాతి రఘు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా కోసం విధుల బహిష్కరణ
శ్రీకాకుళం సిటీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ శుక్రవారం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అధ్యక్షుడు గంగు కృష్ణారావు, ఉపాధ్యక్షుడు మామిడి క్రాంతి, పిట్టా దామోదర్ల ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించిన అనంతరం కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రాకు తక్షణమే ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదించారు. హైకోర్టును ఆంధ్రాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు పొన్నాడ వెంకటరమణారావు, కూన అన్నంనాయుడు, వానకృష్ణచంద్, కె.ఉషారాణి, కె.నాగభూషనరావు, విజయ్‌కుమార్, రమణారావు, ఎస్.శివన్నారాయణ, ఎ.నారాయణరావు, వి.జగన్నాథం, జె.శ్రీనివాసరావు, శశికళ, టి.మధు, మోహనరావు, ఎన్ని సూర్యారావు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయమూర్తిపై దాడి
-ఎనిమిది మంది న్యాయవాదులపై కేసు.. 14 రోజుల రిమాండ్ వరంగల్: హైకోర్టు విభజన చేయాలని కోరుతూ వరంగల్ జిల్లాకు చెందిన న్యాయవాదులు మంగళవారం ఆందోళన చేశారు. వరంగల్ కోర్టులోని న్యాయవాదులంతా సామూహికంగా మొదటి అదనపు కోర్టు ప్రాంగణానికి వెళ్లారు. అక్కడ కోర్టు హాలులో ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం మూకుమ్మడిగా మొదటి అదనపు జిల్లా జడ్జి కేవీ నర్సింహులులో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఆయనపై దాడికి దిగారు. ఈ మేరకు న్యాయమూర్తి నర్సింహులు సుబేదారి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. న్యాయవాదులు రంజిత్, శ్యాంకృష్ణ, రాజేంద్రప్రసాద్, అంబటి శ్రీనివాస్, అల్లం నాగరాజు, రమణ, తీగల జీవన్‌గౌడ్, అఖిల్,పాషాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతం వారిని మొదటి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి అనిత ముందు హాజరు పర్చగా, 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సుబేదారి పోలీసులు ఎనిమిది మంది న్యాయవాదులను సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరళించారు. -
'కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తానంటే ఆయనిష్టం'
న్యూఢిల్లీ: హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని కేంద్ర న్యాయశాఖమంత్రి సదానంద గౌడ అన్నారు. రెండు రాష్ట్రాల నిర్ణయంతోనే హైకోర్టు విభజన జరగాలని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. కేసీఆర్ కేంద్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. హైకోర్టు విభజన అంశంపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, న్యాయవాదుల బృందం ఇవాళ సదానంద గౌడతో భేటీ అయ్యారు. అనంతరం సదానంద మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాల నిర్ణయాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లా కేసీఆర్ మారతానంటే ఆయనిష్టమని సదానందా వ్యాఖ్యానించారు. ఏమీ చేయకపోయినా... ప్రతిరోజు కేజ్రీవాల్ కేంద్రాన్ని నిందిస్తారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం అలా చేస్తానంటే ప్రజలే తగిన జవాబు ఇస్తారన్నారు. రాష్ట్ర విభజన చట్టాన్ని చదవాలని, కేంద్రంపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37వరకూ ఆమోదం ఉందని సదానంద గౌడ తెలిపారు. అలాగే తెలంగాణ హైకోర్టులో 24మంది వరకూ న్యాయమూర్తులకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో 18మంది న్యాయమూర్తులు ఏపీకి చెందినవారు, మరో ముగ్గురు తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారన్నారు. ఈ వివరాలతో తాము విభేదించడం లేదన్నారు. కాని దిగువ కోర్టులతో సంబంధించినంత వరకూ ఏ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంలోనే నియామకం అవుతారన్నారు. జడ్జిల నియామకాలకు సంబంధించి ప్రాథమిక విధానం ఇలా ఉంటుందని, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టి పెడతారని సదానంద గౌడ అన్నారు. పునర్ విభజన చట్టం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏపీ, తెలంగాణ వ్యవహారలను చూస్తారని, అయితే తెలంగాణ రాష్ట్ర సీఎం కేంద్రాన్ని నిందించడం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. హైకోర్టు విభజనకు కేంద్రం ఎలాంటి చొరవ చూపలేదనడం సరికాదని సదానంద గౌడ అన్నారు. రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాలను ఓసారి పరిశీలించాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఈ అంశంపై మూడు,నాలుగుసార్లు తెలంగాణ ఎంపీలు తనను కలిశారని, ఇద్దరు ముఖ్యమంత్రులతో పలుమార్లు మాట్లాడినట్లు సదానంద తెలిపారు. రాష్ట్ర హైకోర్టు విభజన కోసం తాము చేయాల్సిందంతా చేస్తున్నామన్నారు. హైకోర్టు విభజనపై ఇదివరకే పిల్ దాఖలైందని, ఆ పిల్‌ను పరిష్కరించారని, తర్వాత రివ్యూ పిటిషన్ కూడా దాఖలైందన్నారు. ప్రస్తుతం ఆ పిటిషన్ ఉమ్మడి హైకోర్టు ముందుందన్నారు. ఇప్పుడు హైకోర్టు విభజనపై ఏం మాట్లాడినా అది కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు అవుతుందన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా తాను కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని సదానంద గౌడ స్పష్టం చేశారు. ఇది తన దృష్టికి వచ్చినా, మిగతా అంశాలన్నింటిపైనా దృష్టి పెట్టినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఈ విషయాలన్నీ లేఖ రూపంలో రాసినట్లు ఆయన తెలిపారు. అలాగే గవర్నర్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వాళ్ల పరిధిలో అంశాలు ఉన్నాయని సదానంద తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైకోర్టు విభజన అంశంలో మాట్లాడటం కోర్టు ధిక్కరణే అవుతుందన్నారు. ఇంతకన్నా తాము ఏం చేసినా..రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నామని వారే అంటారని, తనవరకు తాను ఏం చేయాలో అది చేస్తున్నానని, ఈ విషయం మీడియాకు బాగా తెలుసునని సదానంద గౌడ వ్యాఖ్యానించారు.