19న లెటర్ రైటింగ్ పోటీలు
Published Wed, Oct 5 2016 1:00 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఈనెల 19వ తేదీన విద్యార్థులకు లెటర్ రైటింగ్ (లేఖరాత) పోటీలు నిర్వహిస్తామని పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాల్గొనే వారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆల్ ఇండియా రేడియోలో ఫిబ్రవరి 16వ తేదీన ఉపన్యసించిన 'సెట్ యువర్ టార్గెట్స్ అండ్ పర్‌స్యూ దెమ్ విత్ ఎ టెన్షన్ ఫ్రీ మైండ్' (లక్ష్యాలను నిర్దేశించుకోండి, ప్రశాంత మనసుతో వాటిని నెరవేర్చండి) అంశంపై లెటర్ రాయాల్సి ఉంటుందన్నారు. పోటీలు పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. విజన్ స్థాయిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థులకు రూ. 1,000, రూ. 800, రూ. 500 చొప్పున బహుమతులు ఇస్తామన్నారు. మొదటి ఐదు ఉత్తమ లెటర్లను జాతీయస్థాయి ఎంపికకు పంపిస్తామన్నారు. ఈ నెల 15వ తేదీలోపు సూపరింటెండెంట్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
Advertisement