సైన్స్‌ లేని జీవితాన్ని ఊహించలేం | life connot imagine without science | Sakshi
Sakshi News home page

సైన్స్‌ లేని జీవితాన్ని ఊహించలేం

Published Sun, Jan 29 2017 9:46 PM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

సైన్స్‌ లేని జీవితాన్ని ఊహించలేం

సైన్స్‌ లేని జీవితాన్ని ఊహించలేం

– హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ దయానంద్‌
కర్నూలు (ఆర్‌యూ): సైన్స్‌ లేని జీవితాన్ని ఊహించుకోలేమని హెచ్‌సీయూ లైఫ్‌సైన్స్‌ ప్రొఫెసర్‌ దయానంద్‌ అన్నారు. రాయలసీమ యూనివర్సిటీలో సైన్స్‌ ఇన్‌స్పైర్‌ క్యాంపు మూడో రోజు నిర్వహించారు. ఫ్లోరైడ్‌ ప్రభావంతో దంత సమస్యలు ఏర్పడుతున్నాయని.. వీటిని ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులు ప్రయోగాత్మకంగా వివరించారు. స్వర్ణముఖినది పరివాహక ప్రాంతం, పులికాట్‌ సరస్సు నీటి నమూనాల గురించి చేసిన పరిశోధనలను ఫ్రొసెర్లు దయానంద్, జనార్దనరాజు వివరించారు. తుంగభద్ర, హంద్రీ, వక్కిలేరు, కుందూ, భవనాశి నదుల్లో మేలైన నీటి సంరక్షణ పద్ధతులు పాటించాలని సూచించారు. నీటి సంరక్షణ ద్వారా రాయలసీమలో కరువు పరిస్థితులను అధిగమించవచ్చన్నారు. 
బ్లాక్‌ బోర్డ్‌ ఉత్తమం..
బోధన సామర్థ్యాలకు ఎలక్ట్రానిక్‌ పరికరాల కాకుండా బ్లాక్‌బోర్డు ఉత్తమంగా ఉంటుందని హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ డా.వి.కన్నన్‌ తెలిపారు. వేదగణితం, సంఖ్యామానం, సంఖ్యామాన విశ్లేషణా పద్ధతులను నల్లబల్ల మీదుగానే విద్యార్థులకు ఉపదేశించారు. మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో జనటిక్‌ ఇంజినీరింగ్‌పై ప్రొఫెసర్‌ దయానంద్‌ ఉపన్యశించారు. 
 
నేటి కార్యక్రమాలు..
వాస్తవ సంఖ్యలు, వాటి అనువర్తితాలు..విశ్లేషణ అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గణితభాగం ప్రొఫెసర్‌ భాస్కరరెడ్డి  ప్రసంగిస్తారు. వాతావరణ కాలుష్యం, పర్యావరణంలో రసాయనశాస్త్రం  ప్రాముఖ్యత, కాలుష్య నివారణ పద్ధతులను పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల కర్నూలు అధ్యాపకులు బి.భాస్కరరెడ్డి వివరిస్తారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement