27 నుంచి ఆర్‌యూలో ఇన్‌స్పైర్‌ సైన్స్‌ క్యాంప్‌ | inspire camp at RU from 27th | Sakshi
Sakshi News home page

27 నుంచి ఆర్‌యూలో ఇన్‌స్పైర్‌ సైన్స్‌ క్యాంప్‌

Published Sat, Jan 7 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

inspire camp at RU from 27th

కర్నూలు సిటీ: రాయలసీమ వర్సిటీలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఇన్‌స్రైర్‌ సైన్స్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నట్లు వీసీ వై.నరసింహూలు, రిజిస్ట్రార్‌ అమర్‌నాథ్‌ శుక్రవారం ఒక  ప్రకటనలో తెలిపారు. ఐదు రోజుల సైన్స్‌ క్యాంప్‌నకు ప్రముఖ శాస్త్రవేత్తలు హాజరుకానున్నారని, ఇందులో కేవలం 100 మందికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి  కల్గిన వారు  ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌తోపాటు ప్రోగ్రామ్‌ కోర్టినేటర్‌ ప్రొఫెసర్‌ ఐఈ.చక్రవర్తి, సహాయ నమన్వయకర్తలు డా.రమణయ్య, కమల(ఫోన్‌: 9393801635, 8986026400)ను సంప్రదించాలన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement