మే 28 నుంచి లిటిల్ కార్నివాల్ | Little Carnival from may28 | Sakshi
Sakshi News home page

మే 28 నుంచి లిటిల్ కార్నివాల్

Published Tue, Apr 26 2016 1:53 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

మే 28 నుంచి లిటిల్ కార్నివాల్ - Sakshi

మే 28 నుంచి లిటిల్ కార్నివాల్

సాక్షి, హైదరాబాద్ : చిన్నారులను అలరించే విభిన్న ఆటలు, వినోదంతో సాగే ‘లిటిల్ కార్నివాల్’ వైవిధ్య ఫన్ ఈవెంట్‌కు నగరం వేదిక కానుంది. సోమవారం నిర్వాహక సంస్థ ‘సర్‌ప్రైజ్ స్టోరీ’ ప్రతినిధులు విశాఖ సింఘానియా, ప్రశంస సహాని వివరాలు వెల్లడించా రు. టీవీలు, మొబైల్స్ కారణంగా శారీరక శ్రమకు, ఆరోగ్యకరమైన వినోదానికి చిన్నారులు దూరమవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో లిటిల్ కార్నివాల్ వినోద సందడికి రూపకల్పన చేశామన్నారు.

మే 28న బంజారాహిల్స్‌లోని అవర్‌ప్లేస్ హోటల్ ఆవరణలో రెండు రోజుల పాటు ఈ ఈవెంట్ ఉంటుందని, క్రియేటివ్ గేమ్స్, లెర్నింగ్ ప్లేస్, ఫ్యాషన్ షోస్, జాయ్‌రైడ్స్, వర్క్‌షాప్స్, కార్టూన్ ప్లేస్... వగైరాలతో వినోద విజ్ఞాన సమాహారంలా సాగుతుందన్నారు. లోగోను నటి సోనీ చరిస్తా, కార్టూన్ క్యారెక్టర్ ‘విన్నీ ద పూ’తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా  చైల్డ్ సైకాలజిస్ట్ ప్రగ్యా రష్మి ‘‘పిల్లల్లో అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఇంపార్టెన్స్-స్మార్ట్ ఫోన్ అడిక్షన్ దుష్ర్పభావాలు’’ అంశంపై ప్రసంగించారు.

Advertisement

పోల్

Advertisement