Surprise Story
-
బాయ్‌ఫ్రెండ్స్ సర్ప్రైజ్.. ప్రియురాళ్లు స్టన్!
-
ముసుగులు తొలగించారు.. ప్రియురాళ్లు షాక్!
కొలంబియా : ఆ బాయ్‌ఫ్రెండ్స్ టూర్లో ఉన్న తమ ప్రియురాళ్లకు జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు. వారిచ్చిన సడెన్ సర్ప్రైజ్కు షాకైపోయిన వారి ప్రియురాళ్లు ఏం మాట్లాడాలో తెలియక కొన్ని క్షణాలు నోళ్లు వెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన జానీ రోడ్స్, టామ్ మిచెల్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ దక్షిణ అమెరికా టూర్లో ఉన్న తమ ప్రియురాళ్లను సర్ప్రైజ్ చేద్దామనుకున్నారు. ఆ సర్ప్రైజ్ ఓ మంచి డ్యాన్స్‌తో ఉంటే ఇంకా బాగుంటుందనుకున్నారు. ఇందుకోసం బాగా ప్రాక్టీస్ చేశారు. అంతా ఓకే అనుకున్నాక 14గంటలు ప్రయాణించి తమ ప్రియురాళ్లు టూర్లో ఉన్న కొలంబియాలోని కార్టజెనాకు చేరుకున్నారు. వాళ్లు అక్కడి ఓ హోటల్లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా కుట్టించిన ముసుగు ఉన్న దుస్తులు ధరించి వారు కూర్చుని ఉన్న హోటల్ టేబుల్ ముందకు వెళ్లారు. కష్టపడి నేర్చుకున్న స్టెప్పులతో ఎక్కడా తడబడకుండా ప్రియురాళ్ల ముందు డ్యాన్స్ చేయటం మొదలుపెట్టారు. డ్యాన్స్ కోసం సిద్ధమవుతున్న జానీ రోడ్స్, టామ్ మిచెల్ టేబుల్ దగ్గర కూర్చున్న వారి ప్రియురాళ్లు డ్యాన్స్‌ను ఎంతో ఆసక్తిచూడటం మొదలుపెట్టారు. డ్యాన్స్ చేయటం అయిపోయిన తర్వాత జానీ,టామ్లు తమ ముసుగులు తొలిగించారు. అంతే! వారి ప్రియురాళ్లు ఒక్కసారిగా షాక్ అయినట్లు చూస్తూ ఉండిపోయారు. తమ బాయ్‌ఫ్రెండ్స్ ఇచ్చిన సడెన్ సర్ప్రైజ్కు ఏం మాట్లాడాలో తెలియక వారిని హత్తుకుపోయారు. టామ్ ప్రియురాలు ఇమిలీ పోటర్ మాట్లాడుతూ.. ‘ ఎవరో ఇద్దరు కొలంబియన్లు మా దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారని అనుకున్నాము. ఇది నా జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్. కొద్దిసేపు నా కాళ్లు చిగురుటాకులా కంపించిపోయాయ’ని తెలిపింది. -
మే 28 నుంచి లిటిల్ కార్నివాల్
సాక్షి, హైదరాబాద్ : చిన్నారులను అలరించే విభిన్న ఆటలు, వినోదంతో సాగే ‘లిటిల్ కార్నివాల్’ వైవిధ్య ఫన్ ఈవెంట్‌కు నగరం వేదిక కానుంది. సోమవారం నిర్వాహక సంస్థ ‘సర్ప్రైజ్ స్టోరీ’ ప్రతినిధులు విశాఖ సింఘానియా, ప్రశంస సహాని వివరాలు వెల్లడించా రు. టీవీలు, మొబైల్స్ కారణంగా శారీరక శ్రమకు, ఆరోగ్యకరమైన వినోదానికి చిన్నారులు దూరమవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో లిటిల్ కార్నివాల్ వినోద సందడికి రూపకల్పన చేశామన్నారు. మే 28న బంజారాహిల్స్‌లోని అవర్‌ప్లేస్ హోటల్ ఆవరణలో రెండు రోజుల పాటు ఈ ఈవెంట్ ఉంటుందని, క్రియేటివ్ గేమ్స్, లెర్నింగ్ ప్లేస్, ఫ్యాషన్ షోస్, జాయ్‌రైడ్స్, వర్క్‌షాప్స్, కార్టూన్ ప్లేస్... వగైరాలతో వినోద విజ్ఞాన సమాహారంలా సాగుతుందన్నారు. లోగోను నటి సోనీ చరిస్తా, కార్టూన్ క్యారెక్టర్ ‘విన్నీ ద పూ’తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చైల్డ్ సైకాలజిస్ట్ ప్రగ్యా రష్మి ‘‘పిల్లల్లో అవుట్డోర్ యాక్టివిటీస్ ఇంపార్టెన్స్-స్మార్ట్ ఫోన్ అడిక్షన్ దుష్ర్పభావాలు’’ అంశంపై ప్రసంగించారు.