
విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి
రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ శివార్లలో గురువారం మధ్యాహ్నం విద్యుత్ షాక్తో ఓ లారీ డ్రైవర్ మృతిచెందాడు. మొమిన్‌పేటలో ఓ వేబ్రిడ్జి వద్ద బోరా గంగయ్య(45) అనే డ్రైవర్ లారీ పెకైక్కే క్రమంలో విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. గంగయ్య స్వస్థలం నల్గొండ జిల్లా మంచన్‌పల్లి గ్రామంగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.