lorry driver died
-
సడన్ బ్రేక్ ప్రాణం తీసింది..
దమ్మపేట: రోడ్డుపై నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు ఓ లారీ డ్రైవర్ ప్రాణాలను బలి తీసుకున్నాయి. స్పీడ్ బ్రేకర్లను ముందుగా గమనించని డ్రైవర్.. సడన్ బ్రేక్ వేయడంతో లారీలో ఉన్న రైల్వే ట్రాక్ పట్టాలు కేబిన్‌లోకి దూసుకొచ్చి తగలడంతో అతడి శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుర్వాయిగూడెంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి రైల్వే ట్రాక్ పట్టాల లోడ్‌తో ట్రాలీ లారీ తమిళనాడులోని తిరుచనాపల్లికి వెళుతోంది. లారీని మధ్యప్రదేశ్‌కు చెందిన కాకు(36) నడుపుతుండగా, ఆకాష్ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. దమ్మపేట మండలం గుర్వాయిగూడెం సమీపంలోని మూలమలుపు వద్ద స్పీడ్ బ్రేకర్లను గమనించని కాకు.. అక్కడికి రాగానే సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ట్రాలీలో ఉన్న రైల్వే ట్రాక్ పట్టాలు కేబిన్‌లోకి దూసుకురాగా లారీ ఒక పక్కకు పడిపోయింది.పట్టాలు డ్రైవర్‌పై పడడంతో శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం కేబిన్‌లో ఇరుక్కుపోయింది. క్లీనర్ మాత్రం కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న సీఐ జితేందర్‌రెడ్డి, ఎస్సై సాయికిశోర్‌రెడ్డి నాలుగు జేసీబీలతో రెండు గంటల పాటు శ్రమించి పట్టాలను, డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆర్తనాదాల్లోనే ఆగిన శ్వాస
పెళ్లకూరు: అర్ధరాత్రి చిమ్మ చీకట్లో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ కేబిన్‌లో ఇరుక్కున్న ఓ లారీడ్రైవర్ కాపాడండి.. కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తూ అంతిమ శ్వాస విడిచాడు. ఈ ఘటన మండలంలోని కొత్తూరు మలుపు వద్ద బుధవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొత్తూరుకు చెందిన లారీ డ్రైవర్ టీ సుబ్బరామిరెడ్డి (36) అదే ప్రాంతానికి చెందిన చేపల వ్యాపారి సుందరరామిరెడ్డి నెల్లూరులోని హరనాథపురం నుంచి చేపల లోడుతో బుధవారం రాత్రి తమిళనాడులోని వేలూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలో పెళ్లకూరు మండలం కొత్తూరు మలుపు వద్ద ముందు వెళుతున్న లారీ అకస్మాతుగా బ్రేక్ వేయడంతో చేపల లోడుతో వెళుతున్న లారీ వెళ్లి ఢీకొంది. ఈ ఘటనలో చేపల లారీడ్రైవర్ సుబ్బరామిరెడ్డి కేబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రగాయాలతో కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేశాడు. సమాచారం అందుకున్న కానిస్టేబు ల్ వేణు ఘ ట నా స్థలా నికి చేరుకొని లారీడ్రైవర్‌ను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అర్ధరాత్రి కావడంతో స్థానికులు కూడా సహకరించకపోవడం వల్ల జేసీబీ సహాయంతో రెండు లారీలను వేరు చేశా రు. అ ప్పటికే డ్రైవర్ సుబ్బరామిరెడ్డి మృతి చెందగా లారీలో ఉన్న చేపల వ్యాపారి సుందరరామిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుకు ఇరువైపుల రెండు కిలో మీట ర్లుకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేర కు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత్యువై దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు కొత్తూరు వద్ద అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు లారీడ్రైవర్ పాలిట మృత్యువై దూసుకువచ్చింది. తిరుపతి నుంచి విజయవాడకు వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సు కొత్తూరు మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ మీదకు దూసుకొచ్చే సమయంలో లారీ డ్రైవర్ చాకచక్యంగా బస్సును తప్పించే క్రమంలో అకస్మాత్తుగా బ్రేక్‌లు వేశాడు. దీంతో వెనుక వెళుతున్న చేపల లారీ ముందు లారీని ఢీకొనడం ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో 52 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సుకు పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. -
విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి
రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ శివార్లలో గురువారం మధ్యాహ్నం విద్యుత్ షాక్‌తో ఓ లారీ డ్రైవర్ మృతిచెందాడు. మొమిన్‌పేటలో ఓ వేబ్రిడ్జి వద్ద బోరా గంగయ్య(45) అనే డ్రైవర్ లారీ పెకైక్కే క్రమంలో విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. గంగయ్య స్వస్థలం నల్గొండ జిల్లా మంచన్‌పల్లి గ్రామంగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యుత్ తీగలు తగిలి డ్రైవర్ మృతి
తొండూరు : విద్యుత్ తీగలు తగిలి ఓ లారీ డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం గంగనపల్లి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన లారీ డ్రైవర్ మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామంలోని రైతుల నుంచి కొనుగోలు చేసిన అరటి గెలలను లోడ్ చేసుకొని వెళ్తున్న లారీ, చెరువు సమీపానికి వచ్చేసరికి విద్యుత్ తీగలు అడ్డంగా ఉండటంతో అక్కడే నిలిచిపోయింది. విద్యుత్ తీగలను తొలగించడానికి ప్రయత్నించిన లారీ డ్రైవర్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతిచెందగా, అతని సహాయకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా అతన్ని వెంటనే పులివెందులలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.