విద్యుత్ తీగలు తగిలి డ్రైవర్ మృతి | lorry driver died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ తీగలు తగిలి డ్రైవర్ మృతి

Published Tue, Mar 24 2015 3:49 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM

lorry driver died due to current shock

తొండూరు  : విద్యుత్ తీగలు తగిలి ఓ లారీ డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం గంగనపల్లి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన లారీ డ్రైవర్ మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామంలోని రైతుల నుంచి కొనుగోలు చేసిన అరటి గెలలను లోడ్ చేసుకొని వెళ్తున్న లారీ, చెరువు సమీపానికి వచ్చేసరికి విద్యుత్ తీగలు అడ్డంగా ఉండటంతో అక్కడే నిలిచిపోయింది.

విద్యుత్ తీగలను తొలగించడానికి ప్రయత్నించిన లారీ డ్రైవర్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతిచెందగా, అతని సహాయకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా అతన్ని వెంటనే పులివెందులలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement