Tonduru
-
వేరుశనగ రైతులకు అన్యాయం
► అధికారుల నిలదీత ► పోలీసుల సమక్షంలోబాండ్ల పంపిణీ తొండూరు : ఖరీఫ్ 2016లో వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీలో అవకతవకలు జరిగాయని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఇనగలూరు గ్రామంలో సర్పంచ్ సావిత్రమ్మ అధ్యక్షతన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ బాండ్ల పంపిణీ కార్యక్రమం ఏఓ కిశోర్ నాయక్ ప్రారంభించారు. పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాకుండా.. పంట సాగు చేయని వారికి ఎలా వచ్చిందంటూ వ్యవసాయాధికారులను అన్నదాతలు నిలదీశారు. వేరుశనగ సాగు చేసిన వారి పేర్లను ఎంపీఈఓ శివ చదివి వినిపించారు.సాగుచేయని వారి పేర్లు జాబితాలో ఎలా వచ్చాయంటూ అధికారులను నిలదీశారు.అర్హులైన వారికి బాండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చక్రం తిప్పిన గ్రామ నౌకర్లు: ఇన్పుట్ సబ్సిడీ మంజూరులో గ్రామ నౌకర్లు చక్రం తిప్పినట్లు రైతులు చెబుతున్నారు. గ్రామ నౌకర్లు, ఎంపీఈఓలు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లినప్పుడు రైతుల వద్ద డబ్బులు తీసుకుని పంట సాగు చేయని వారి పేర్లను జాబితాలో పొందుపరిచారని ఆరోపించారు. గ్రామంలో ఓ రైతు అర ఎకరాలో వేరుశనగ సాగు చేస్తే రూ.13వేలు,మరొకరికి ఎకరాకు రూ.26వేలు మంజూరైందని.. అర్హులైన మేం ఐదెకరాల్లో సాగు చేస్తే కేవలం రూ.6వేలు మాత్రమే వచ్చిందని గ్రామానికి చెందిన బాల ఎరికల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి అంకిరెడ్డి, అరుణమ్మ, వీరనారాయణరెడ్డి తెలిపారు. ఎంపీఈఓలు, జియో ట్యాగింగ్ చేసే సమయంలో గ్రామ నౌకర్లు కొంతమంది చక్రం తిప్పారని అన్నదాతలు ఆరోపించారు. కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో ఏఓ కిశోర్ నాయక్ తొండూరు ఎస్ఐ శ్రీనివాసులుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్ఐ వెంటనే ఏఎస్ఐ రమణ, పోలీసు సిబ్బందిని ఇనగలూరు గ్రామానికి పంపించారు. పోలీసుల సమక్షంలో బాండ్లు పంపిణీ చేశారు. ఈ విషయమై ఏఓ కిశోర్నాయక్ను సాక్షి వివరణ కోరగా ఫీల్డ్ విజిట్‌లో రెవెన్యూ అధికారులు పొరపాటు చేయడంవల్ల ఇలా జరిగిందని.. రెండు రోజుల్లో రెవెన్యూ అధికారులతో చర్చించి రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ అందేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ తాలుకా కార్యదర్శి దశరథరామిరెడ్డి, మాజీ సర్పంచ్ గంగయ్య, ఎంపీఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
జలం కోసం దీక్ష
తొండూరు : పైడిపాలెం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను సంతకొవ్వూరు కెనాల్ ద్వారా విడుదల చేయాలని కోరుతూ రెండు రోజులుగా కెనాల్ వద్ద దీక్ష కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన దీక్ష బుధవారం రాత్రి వరకు కొనసాగినా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ తొండూరు మండలానికి నీరు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. సంతకొవ్వూరు కెనాల్ కింద దాదాపు సుంకేసుల, రావులకొలను, బోడివారిపల్లె, బూచుపల్లె, మల్లేల, కోరవానిపల్లె తదితర గ్రామాలకు చెందిన రైతులు బోరుబావుల కింద సాగు చేసిన పంటలు, పండ్ల తోటలు వాడు దశకు చేరుకున్నాయి. గత 5 రోజులుగా హిమకుంట్ల చెరువుకు కృష్ణా జలాలను వదులుతున్న అధికారులు తొండూరు మండలం సంతకొవ్వూరు కెనాల్‌కు వదలకుండా పక్షపతం చూపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోలేదని.. వందలాది మంది రైతులు రేయింబవళ్లు కెనాల్ వద్ద పడిగాపులు కాస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు, రైతులతో చర్చించిన డీఎస్పీ, ఇరిగేషన్ ఎస్ఈ సంతకొవ్వూరు కెనాల్‌కు కృష్ణా జలాలు విడుదల చేయాలని గత రెండు రోజులుగా దీక్ష చేస్తున్న రైతులు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి అంకిరెడ్డి సురేష్‌రెడ్డి, మండల పరిశీలకుడు బండి రామమునిరెడ్డి, మండల నాయకుడు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి తదితర వైస్సార్సీపీ నాయకులతో బుధవారం మధ్యాహ్నం జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ చెంగయ్యలు చర్చించారు. 300 క్యూసెక్కుల నీటిని హిమకుంట్ల చెరువుకు తరలిస్తున్నారని.. అంతే కెపాసిటీతో సంతకొవ్వూరు కెనాల్‌కు నీటిని విడుదల చేయాల్సి ఉందన్నారు. కానీ కేవలం 50 క్యూసెక్కుల నీరు మాత్రమే సంతకొవ్వూరు కెనాల్‌కు విడుదల చేయాలని.. మిగతా 250 క్యూసెక్కుల నీటిని హిమకుంట్ల చెరువుకు విడుదల చేయాలని అధికారులను కోరినా వాటిలో ఎలాంటి మార్పు కానరాకపోవడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. దీంతో మండల కో ఆప్షన్ సభ్యుడు వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు తమ గ్రామంపై చిన్నచూపు చూస్తున్నారని.. నీటిని ఇచ్చేంతవరకు ఇక్కడినుంచి కదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. నీటిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన రైతు సంతకొవ్వూరు కెనాల్‌కు నీటిని విడుదల చేయాలంటూ కాలువ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ బూచుపల్లె గ్రామానికి చెందిన నాగ ఈశ్వరయ్య అనే చీనీ రైతు కాలువలోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్, ఎర్రగుంట్ల సీఐ శ్రీనివాసులు ఉన్నతాధికారులతో చర్చించి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చి కాలువలో నుంచి నాగఈశ్వరయ్యను బయటకు తీశారు. పోలీసుల ప్రతాపం కృష్ణా జలాల కోసం సంతకొవ్వూరు కెనాల్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులకు న్యాయం చేసేందుకు యత్నించాల్సిన పోలీసులు రైతులపై ప్రతాపం చూపుతున్నారు. దాదాపు 5మంది సీఐలు, 12మంది ఎస్ఐలు, 100మంది పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలను తెప్పించి అధికారులు రైతులతో మాట్లాడకుండా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు విడుదల చేసేంతవరకు పంపించేది లేదంటూ ఎస్ఈ చెంగయ్య వాహనాన్ని అడ్డుకున్న రైతులను పోలీసులు బలవంతంగా పక్కకు నెట్టడంతో పోలీసులు, రైతుల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు సంఘం మండల నాయకుడు పల్లేటి ఈశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శులు రమణారెడ్డి, షఫి, తాలుకా ప్రధాన కార్యదర్శి దశరథరామిరెడ్డి, ఎంపీటీసీ శివశంకర్‌రెడ్డి, సర్పంచ్‌లు గురుమోహన్‌రెడ్డి, వెంకటచలమారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బాలనరసింహారెడ్డి, భాస్కర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డి, కుమార్, రాఘవరెడ్డి, శేఖరరెడ్డి, రామమునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అన్నీ అబద్ధపు హామీలే
తొండూరు : ఎన్నికలలో చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పి వాటితోనే సీఎం పదవి దక్కించుకున్నారని.. తర్వాత ప్రజలను పట్టించుకోకుండా మోసం చేశారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం మండలంలోని తొండూరు, కోరవానిపల్లె గ్రామాల్లో గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా తొండూరు శివాలయం, కోరవానిపల్లెలో రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ప్రారంభించారు. తొండూరుకు చేరుకున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, జనార్థన్‌రెడ్డి, రాఘవరెడ్డిలతోపాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు బాణా సంచా పేల్చుతూ.. డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అలాగే కోరవానిపల్లెకు గడప గడపకు వచ్చిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ఆలకించారు. తొండూరుకు చెందిన కుమ్మరి వెంకటసుబ్బన్నతోపాటు మరికొంతమంది మహిళలు, వృద్ధులు, వికలాంగులు పింఛన్లు రాలేదని అవినాష్‌రెడ్డి ఎదుట వాపోయారు. అర్హతలున్నా పింఛన్ రాకుండా జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గతంలో వర్షాలు కురిసినప్పుడు గృహాలు కూలిపోయిన కోరవానిపల్లె శివయ్య, తొండూరుకు నారాయణలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదని.. అర్జీ ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని ఎంపీకి మొరపెట్టుకున్నారు. తొండూరుకు చెందిన అలవలపాడు సూర్యనారాయణరెడ్డి గత కొంతకాలంగా పక్షపాతంతో బాధపడుతూ మంచంలో ఉన్న వ్యక్తిని పరామర్శించారు. అలాగే హరిజనవాడలో అనారోగ్యంతో బాధపడుతున్న చెందిన డ్రైవర్ శ్రీనివాసులును ఎంపీ పరామర్శించారు. రజకుల, ఎస్టీ కాలనీల్లో ఉన్న సమస్యలతోపాటు వడ్డెర కాలనీ, కోరవానిపల్లె గ్రామాల్లో ఉన్న నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఎంపీకి వివరించారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిక : కోరవానిపల్లెకు చెందిన చిట్టిబోయిన సోమేశులు, తాటి లక్షుమయ్యతోపాటు మరికొంతమంది కార్యకర్తలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ఈశ్వరయ్య అనే రైతు సోనాలిక కంపెనీకి చెందిన నూతన మినీ ట్రాక్టర్‌ను స్వయంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డ్రైవింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మండల పరిశీలకుడు బండి రామమునిరెడ్డి, మండల నాయకులు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, సీనియర్ నాయకులు ఎర్ర గంగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అంకిరెడ్డి సురేష్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు బండి రమణారెడ్డి, ఓతూరు రసూల్, సింగిల్ విండో డైరెక్టర్ రమణారెడ్డి, జిల్లా సెక్రటరీ షఫి, తాలుకా ప్రధాన కార్యదర్శి దశరథరామిరెడ్డి, ఎంపీటీసీ అగడూరు శివశంకర్‌రెడ్డి, మండల కో.ఆప్షన్ మెంబరు వెంకట్రామిరెడ్డి, రైతు సంఘ నాయకులు పల్లేటి ఈశ్వరరెడ్డి, సర్పంచ్‌లు ప్రకాష్‌రావు, వెంకటచలమారెడ్డి, గురుమోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఓబుళరెడ్డి, శివగంగిరెడ్డి, బాబుల్‌రెడ్డి, గంగులయ్య, గంగయ్య, వాటర్ షెడ్ చైర్మన్ సోమశేఖర్, ఉల్లిమెల్ల శంకర్‌రెడ్డి, సింహాద్రిపురం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రకాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డి, తొండూరు వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకట్రామిరెడ్డి, బంగారు మునెయ్య, నడిపిరాజా, యల్లారెడ్డి, విశ్వనాథరెడ్డి, రామచంద్రారెడ్డి, పద్మనాభరెడ్డి, రాజమోహన్‌రెడ్డి, కోరవానిపల్లె నాయకులు నాగమునెయ్య, శివయ్య, పుల్లయ్య, గోవర్థన్, సోమిరెడ్డి, గోవర్థన్, రంగయ్యలతోపాటు తొండూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రశేఖరరెడ్డి, బాలనరసింహారెడ్డి, బాలగంగిరెడ్డి, రజినికాంత్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, బాల ఎరికల్‌రెడ్డి, నరసింహారెడ్డి, రామాంజనేయరెడ్డి, రామమునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ తీగలు తగిలి డ్రైవర్ మృతి
తొండూరు : విద్యుత్ తీగలు తగిలి ఓ లారీ డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం గంగనపల్లి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన లారీ డ్రైవర్ మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామంలోని రైతుల నుంచి కొనుగోలు చేసిన అరటి గెలలను లోడ్ చేసుకొని వెళ్తున్న లారీ, చెరువు సమీపానికి వచ్చేసరికి విద్యుత్ తీగలు అడ్డంగా ఉండటంతో అక్కడే నిలిచిపోయింది. విద్యుత్ తీగలను తొలగించడానికి ప్రయత్నించిన లారీ డ్రైవర్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతిచెందగా, అతని సహాయకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా అతన్ని వెంటనే పులివెందులలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ వల్లే పేదలకు కార్పొరేట్ వైద్యం
తొండూరు : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ 7,500మందికి సర్జరీలు జరిగినట్లు ఆరోగ్య శ్రీ జిల్లా కో-ఆర్డినేటరు వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన తొండూరు పీహెచ్సీలో ఆరోగ్య శ్రీ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొండూరు మండలంలో ఆరోగ్యశ్రీ కింద దాదాపు 660మందికి పలు రకాల వ్యాధులకు సంబంధించి ఆపరేషన్లు జరిగినట్లు తెలిపారు. అందుకు సంబంధించి రూ.1.85కోట్లు మండలానికి.. 7,500మందికి గానూ జిల్లాకు రూ.223కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు లబ్ధిదారులతో మాట్లాడారు. వారి ఆరోగ్య స్థితిగతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ గిరిధర్, డీటీఎల్ రామరావు, ఆరోగ్య మిత్రలు సురేష్‌రెడ్డి, కిరణ్ పాల్గొన్నారు.