లారీ కేబిన్‌లో ఇరుక్కుపోయి మృతి చెందిన డ్రైవర్ సుబ్బరామిరెడ్డి
పెళ్లకూరు: అర్ధరాత్రి చిమ్మ చీకట్లో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ కేబిన్‌లో ఇరుక్కున్న ఓ లారీడ్రైవర్ కాపాడండి.. కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తూ అంతిమ శ్వాస విడిచాడు. ఈ ఘటన మండలంలోని కొత్తూరు మలుపు వద్ద బుధవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొత్తూరుకు చెందిన లారీ డ్రైవర్ టీ సుబ్బరామిరెడ్డి (36) అదే ప్రాంతానికి చెందిన చేపల వ్యాపారి సుందరరామిరెడ్డి నెల్లూరులోని హరనాథపురం నుంచి చేపల లోడుతో బుధవారం రాత్రి తమిళనాడులోని వేలూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలో పెళ్లకూరు మండలం కొత్తూరు మలుపు వద్ద ముందు వెళుతున్న లారీ అకస్మాతుగా బ్రేక్ వేయడంతో చేపల లోడుతో వెళుతున్న లారీ వెళ్లి ఢీకొంది.
ఈ ఘటనలో చేపల లారీడ్రైవర్ సుబ్బరామిరెడ్డి కేబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రగాయాలతో కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేశాడు. సమాచారం అందుకున్న కానిస్టేబు ల్ వేణు ఘ ట నా స్థలా నికి చేరుకొని లారీడ్రైవర్‌ను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అర్ధరాత్రి కావడంతో స్థానికులు కూడా సహకరించకపోవడం వల్ల జేసీబీ సహాయంతో రెండు లారీలను వేరు చేశా రు. అ ప్పటికే డ్రైవర్ సుబ్బరామిరెడ్డి మృతి చెందగా లారీలో ఉన్న చేపల వ్యాపారి సుందరరామిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుకు ఇరువైపుల రెండు కిలో మీట ర్లుకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేర కు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృత్యువై దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు
కొత్తూరు వద్ద అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు లారీడ్రైవర్ పాలిట మృత్యువై దూసుకువచ్చింది. తిరుపతి నుంచి విజయవాడకు వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సు కొత్తూరు మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ మీదకు దూసుకొచ్చే సమయంలో లారీ డ్రైవర్ చాకచక్యంగా బస్సును తప్పించే క్రమంలో అకస్మాత్తుగా బ్రేక్‌లు వేశాడు. దీంతో వెనుక వెళుతున్న చేపల లారీ ముందు లారీని ఢీకొనడం ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో 52 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సుకు పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment