లారీ ఢీకొని వ్యక్తి మృతి
Published Fri, Dec 9 2016 6:00 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
మేడ్చెల్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఆంజనేయులు(32) రోడ్డు దాటుతున్న సమయంలో లారీ ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్ధలికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement