రక్షణ కోరిన ప్రేమజంట | Love Couple wants Protection of Female police officers | Sakshi

రక్షణ కోరిన ప్రేమజంట

Jun 29 2016 2:25 AM | Updated on Sep 4 2017 3:38 AM

ప్రేమించి పెళ్లిచేసుకున్నాం.. రక్షణ కల్పించండి అని ఓ ప్రేమజంట మంగళవారం రాత్రి మహిళా పోలీసులను ఆశ్రయించింది.

నెల్లూరు(క్రైమ్) : ప్రేమించి పెళ్లిచేసుకున్నాం.. రక్షణ కల్పించండి అని ఓ ప్రేమజంట మంగళవారం రాత్రి మహిళా పోలీసులను ఆశ్రయించింది. వివరాలు.. కావలికి చెందిన మనూష ఆమె మేనమామ చంటిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో ఇద్దరూ ఇంట్లో నుంచి రెండురోజుల క్రితం పారిపోయి బుజబుజనెల్లూరు తల్పగిరికాలనీలోని దేవాలయంలో వివాహం చేసుకున్నారు.

మంగళవారం రాత్రి తమ తల్లిదండ్రుల నుంచి ప్రమాదం ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరువర్గాల పెద్దలకు ఫోనుచేసి దంపతులకు హాని కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ప్రేమజంటను కావలి పోలీసులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement