కొనసాగుతున్న అల్పపీడనం
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపడీనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
గడిచిన 24 గంటల్లో పిడుగురాళ్లలో 9 సెంటీమీటర్లు, కారంచేడులో 8 సెం.మీ, ప్రకాశం బ్యారేజ్, అవనిగడ్డ, రాజమండ్రి, విజయవాడ, రేపల్లె, ధవళేశ్వరంలో 7 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.