
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం స్వామివారిని1,02,862 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.