జిల్లాకేంద్రంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భగవంత్‌రెడ్డి, తదితరులు
-
మహానేతను మరువని ప్రజలు
-
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతురెడ్డి
-
జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌కు ఘన నివాళి
మహబూబ్‌నగర్ అర్బన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏడో వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆ మహానేతకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఘన నివాళి అర్పించారు. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. పేదలకు అన్నదానం చేపట్టారు. రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. జిల్లాకేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాజన్న వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహ సర్కిల్‌లోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏనుగొండలోని అనాథ పిల్లల ఆశ్రమంలో పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా భగవంతురెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్సార్‌ను మరిపించే పాలకులే లేరని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వినూత్న పథకాలను అమలు చేసి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా పేరొందారని గుర్తు చేశారు. అందుకే ప్రజలు మహానేతను మరవలేక పోతున్నారని, వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకు రావడానికి ఆయన ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, తాగునీరు, సాగునీరు, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలను కల్పించారని గుర్తుచేశారు. జిల్లాను మరో కోనసీమగా చేయడానికి జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులను ప్రారంభించారన్నారు. ఆయా కార్యక్రమాల్లో మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్లా, యువజన, మైనార్టీ మహిళా, ఎస్సీ విభాగాల జిల్లా అధ్యక్షులు జెట్టి రాజశేఖర్, మహ్మద్ హైదర్ అలీ, ఇందిర, మిట్టమీది నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు మహ్మద్ వాజిద్, లక్ష్మీ నారాయణ, కార్యదర్శి రాజశేఖర్, నేతలు సర్దార్, అశోక్, ప్రేమ్‌కుమార్, సర్వర్, యాదగిరి, రఘునాథ్ రెడ్డి, జహంగీర్, సమద్, అన్వర్ పటేల్, ప్రవీణ్ కుమార్, రాజ్‌కుమార్ రెడ్డి, అంజి, రాజారెడ్డి, ఆసిఫ్‌ఖాన్, విజయకుమార్, ఖతాల్, మారుతి, రామకృష్ణ, శివ, అమ్రీష్, మణి, సుభాష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.