వెంకన్నకు మొక్కు చెల్లించుకున్న నమ్రత | Mahesh babu wife namrata tonsures her head in tirumala | Sakshi
Sakshi News home page

వెంకన్నకు మొక్కు చెల్లించుకున్న నమ్రత

Published Wed, Sep 21 2016 5:33 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

వెంకన్నకు మొక్కు చెల్లించుకున్న నమ్రత

వెంకన్నకు మొక్కు చెల్లించుకున్న నమ్రత

తిరుమల : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత...కలియుగ దైవం శ్రీనివాసుడికి మొక్కు చెల్లించుకున్నారు. స్వామివారినకి ఆమె తలనీలాలు అర్పించి మొక్కు తీర్చుకున్నారు. బుధవారం  కుమారుడు గౌతమ్‌, కుమార్తె సితారతో కలిసి  నమ్రత ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామివారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఆ తర్వాత రంగనాయక మండపంలో వారికి పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయాధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా మహేష్ కుటుంబ సభ్యులు చూసేందుకు అక్కడివారు ఉత్సాహం చూపించారు. మరోవైపు దర్శకుడు మెహర్ రమేష్ కూడా స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. కాగా మహేష్‌బాబు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నేషనల్‌ బ్రాండ్‌కు సంబంధించిన యాడ్‌ చిత్రీకరణకు మెహర్‌ రమేష్ దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలోనే యాడ్‌ చిత్రీకరణ జరుపనున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా షూటింగ్ లో బిజిబిజీగా ఉన్నాడు. గత మూడు వారాలుగా చెన్నైలోని ఇవిపి వరల్డ్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబు  ఈ సినిమాలో ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement