ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా | make As the ideal village | Sakshi
Sakshi News home page

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

Published Fri, Nov 18 2016 3:02 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

ఆదర్శ గ్రామంగా  తీర్చిదిద్దుతా

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్
బోథ్ : మండలంలోని కుచులాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ అన్నారు. గురువారం గ్రామంలో శబ రిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడవాలని, భక్తితోనే ముక్తి లభిసుం్తదని అన్నారు. మంచి మనసుతో పనులన ు చేస్తే ఖచ్చితంగా విజయవంతమవుతాయని చెప్పారు. కాగా గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామి ఇచ్చారు. కాగా గడిచిన కాలంలో నియోజకవర్గంలో దాదాపు 400 బోర్లు వేయించామని, ఈ గ్రామంలో కూడా త్వరలోనే బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు.

గ్రామానికి 10 డబుల్ బెడ్‌రూం ఇళ్ళను మంజూరు చేయిస్తానని తెలి పారు. దళితులకు 3 ఎకరాల భూమి త్వరలోనే ఇవ్వబోతున్నామన్నారు. అనంతరం సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనసూయ, ఎంపీపీ గంగుల లక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి, వైస్ చైర్మన్ దావుల భోజారెడ్డి, ఎంపీటీసీలు సోలంకి సునీత, రాయల్, తెరాస మండల అధ్యక్షుడు రుక్మన్ సింగ్, నారాయణ రెడ్డి,మల్లేష్, జగన్, సత్యనారాయణ, దేవిదాస్, మంత్రి ప్రకాష్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement