Ideal village
-
ఉత్తర తెలంగాణలో ఆదర్శగ్రామంగా మల్లంపల్లి
ములుగు: కృషి, పట్టుదలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు పాలకవర్గం అధికారులు కష్టపడితే మారుమూల గ్రామం సైతం ఆదర్శంగా మారుతుంది. అనడానికి జిల్లాలోని ములుగు మండలం మల్లంపల్లి గ్రామం ఉదహరణగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఏడాది మల్లంపల్లి రాష్ట్ర స్థాయిలో పోటీపడి ఎస్ఎస్ఐపీ (సెల్ఫ్ సఫీసియంట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ పంచాయతీ) విభాగంలో అవార్డును గెలుచుకుంది. హైదరాబాద్ లో అవార్డుల ప్రదానోత్సవం ములుగు జిల్లా ఏర్పాటు అనంతరం తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్న 27 జీపీల సర్పంచులు, కార్యదర్శులతో కలిసి మల్లంపల్లి పాలకవర్గం, జిల్లా యంత్రాంగం నేడు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ రాష్ట్ర స్థాయి అవార్డును మల్లంపల్లి సర్పంచ్ చందా కుమారస్వామి, కార్యదర్శి పి.రాజు అందుకోనున్నారు. రూ.2.66కోట్లతో మౌలిక వసతులు జిల్లాలోని ములుగు మండలం మల్లంపల్లి గ్రామ పంచాయతీ 365, 163 జాతీయ రహదారిపై ఉన్నప్పటికీ సాధారణ జీపీగానే అందరికీ తెలుసు. 2021–2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2.66 కోట్ల నిధులను మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ అవార్డుకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయికి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి డ్యాక్యు మెంటరీని అధికారులు సమర్పించారు. మండల, జిల్లా స్థాయిలో అవార్డును గెలుచుకున్న మల్లంపల్లి రాష్ట్రస్థాయి అవార్డు కోసం చేసిన డాక్యుమెంటరీలో డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఏర్పాటు, గ్రంథాలయం, కమ్యూనిటీ సెంటర్, విలేజ్ పార్కు, ప్లే గ్రౌండ్, ఈ పంచాయతీ, పురుషులు, స్త్రీలకు ప్రత్యేక మరుగుదొడ్లు వంటి స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల పంచాయతీ కింద ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిటీ మల్లంపల్లిని రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లాలో 174 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇటీవల 27 గ్రామ పంచాయతీలు 9 అంశాలలో 3 గ్రామ పంచాయతీల చొప్పున 27 పంచాయతీలు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. మల్లంపల్లి వివరాలు ఇళ్లు 1,250 వార్డులు 12 జనాభా 4,670 సహకరించిన వారికి కృతజ్ఞతలు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా పంచాయతీ అధికారి కొండా వెంకటయ్య సహకారంతో ఎప్పటికప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రణాళిక రూపొందించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనులను సక్రమంగా పూర్తిచేశాం. పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, నర్సరీలు, సెగ్రిగేషన్ షెడ్, క్రిమిటోరియం, తడి, పొడి చెత్త వేరుచేయడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇటీవల ములుగులో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్నాం. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. - చందా కుమారస్వామి, సర్పంచ్ మల్లంపల్లి బాధ్యత పెరిగింది మల్లంపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జీపీ అవార్డుకు ఎంపిక కావడంతో గతం కంటే ప్రస్తుతం మరింత బాధ్యత పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ప్రతీ పనిని బాధ్యతతో పూర్తి చేశాం. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల సలహాలు సూచనలు తీసుకుని పనులు పూర్తి చేశాం. కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ ప్రజలు అభివృద్ధి పనుల్లో సహకరించారు. ఇక ముందు మల్లంపల్లిని గంగదేవిపల్లిలా ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతాం. ఇందుకోసం పాలకవర్గం గ్రామ పెద్దలతో కలిసి నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. పి.రాజు, పంచాయతీ కార్యదర్శి మల్లంపల్లి -
పాతికేళ్లుగా మద్యం, మాంసానికి దూరం.. అలా ఎలా సాధ్యమంటే..
సాక్షి, తలమడుగు(ఆదిలాబాద్): మహాత్ముడి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటున్న గ్రామమది. మాటకు కట్టుబడి దశాబ్దాలుగా మద్యపానం, జీవహింసకు దూరంగా ఉంటున్న పల్లె. పాతికేళ్లుగా మద్యం, మాంసం ముట్టకుండా.. నిత్యం ఆధ్యాత్మిక భావనతో ఆదర్శంగా నిలుస్తోంది తలమడుగు మండలంలోని పల్సి(బి)తండా. గొడవలు లేకుండా.. ఠాణా మెట్లెక్కకుండా ఐక్యతతో మందుకు సాగుతున్నారు ఈ గ్రామస్తులు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఈ పంచాయతీపై ప్రత్యేక కథనం. నాడు (1997లో) తండాలో పలువురు మద్యానికి బానిసయ్యారు. నిత్యం గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో ఇద్దరు ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబాలు ఛిద్రమయ్యాయి. అప్పుడే తండా పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఎవరూ మద్యం ముట్టవద్దని.. అమ్మవద్దని తీర్మాణం చేశారు. అదే సమయంలో గ్రామానికి నారాయణ బాబా విచ్చేశారు. ఆయన ప్రబోధాలతో మాంసానికి సైతం దూరమయ్యారు. ఆధ్యాత్మికానికి చేరువయ్యారు. ఆధ్యాత్మికం వైపు... గ్రామ జనాభా 800 వరకు ఉంటుంది. నారాయణ బాబా మరణానంతరం గ్రామంలో ఆయన పేరిట 13 ఏళ్ల క్రితం ఆలయం నిర్మించుకున్నారు. ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించడం.. అన్నదానాలు చేయడం.. ఏటా దత్తజయంతి ఉత్సవాలను సమష్టిగా ఘనంగా నిర్వహించుకోవడం వీరికి ఆనవాయితీ. సమష్టి నిర్ణయాలతో గ్రామ అభివృద్ధిలోనూ అందరూ భాగస్వాములవుతున్నారు. వృద్ధులను ఆదుకోవాలనే ఉద్దేశంతో శ్రీసద్గురు నా రాయణబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం సైతం నిర్మించి పలువురికి ఆశ్రయం కల్పిస్తున్నారు. సంస్థాన్ అధ్యక్షుడు జాదవ్ కిషన్ ఆధ్వర్యంలో ఇప్పటికీ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నూతన పంచాయతీ... ఇటీవల ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయగా పల్సి తండా అందులో భాగమైంది. సమష్టి నిర్ణయంతో ఏకగ్రీవం బాటపట్టింది. ఎన్నిక లేకుండానే సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకున్నారు ఇక్కడి వారు. మద్యానికి దూరంగా ఉండడంతోనే ఐక్యత నెలకొందని, అంతేకాకుండా గొడవలు లేకుండా శాంతియుతంగా కలిసిమెలిసి ఉంటున్నామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఏకగ్రీవంగానే.. మా గ్రామంలో సర్పంచ్, వార్డుమెంబర్ల ఎన్నికలు జరుగలే. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. ఏకగ్రీవం చేయాలని నిర్ణయించుకున్నాం. సర్పంచ్‌గా నన్ను ఎన్నుకున్న రు. అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తున్నా. – చౌహన్ ఆంగుర్, సర్పంచ్ ఒకే మాటపై ఉంటాం.. గ్రామ జనాభా 800 దాకా ఉంటది. అందరం ఒకే మాటపై ఉంటాం. దానికి కారణం గ్రామంలో పాతికేళ్లుగా మద్యం, మాంసం ముట్టుకోకపోవడమే. పండుగలు, శుభకార్యాలను కలిసిమెలిసి జరుపుకుంటాం. – జాదవ్ కిషన్, నారాయణబాబా సంస్థాన్ అధ్యక్షుడు ఠాణా మెట్లు ఎక్కలే.. మద్యానికి దూరంగా ఉండడంతో ఇప్పటి వరకు గ్రామంలో ఎలాంటి గొడవలు జరిగిన సంఘటనలు లేవు. ఠాణా మెట్లు కూడా ఎక్కలే. గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉంటాం. – జాదవ్ విజయ్‌కుమార్, టీచర్ -
ఈ గ్రామంలో మందు ముట్టరు.. స్టేషన్ మెట్లెక్కరు!
పచ్చని అడవి ఒడిలో సేదదీరుతున్నట్టుండే ఆ ఊరు ఎన్నో ఆదర్శాలకు మారుపేరు. ఆ ఊళ్లోని వారెవరూ మద్యం ముట్టరు. ఇప్పటివరకు పోలీస్‌స్టేషన్ మెట్లెక్కింది లేదు. చిన్నా చితకా తగాదాలొచ్చినా.. కూర్చుని మాట్లాడుకుంటారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలోని మొట్లతిమ్మాపురం గ్రామ ప్రత్యేకతలివీ.. సాక్షి, బయ్యారం: పూర్తిగా ఆదివాసీలుండే ఈ గ్రామంలో నేటికీ ఆచార వ్యవçహారాలు, కట్టుబాట్లు పక్కా కొనసాగుతున్నాయి. గ్రామ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ గ్రామస్తులెవరూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది లేదు. తగాదాలొస్తే పెద్దమనుషుల సమక్షంలోనే పరిష్కరించుకుంటారు. పెద్దలు చెప్పే తీర్పునకు ఇరువర్గాలు కట్టుబడుతాయి. ఆదివాసీలు పెద్దలుగా భావించే పటేల్, దొరల తీర్పే నేటికి ఆ పల్లెవాసులకు వేదవాక్కు. గతంలో రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో ఉన్న మొట్లతిమ్మాపురాన్ని ఇటీవల కొత్తగా పంచాయతీగా ఏర్పాటుచేశారు. గ్రామస్తులు సర్పంచ్, వార్డుసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచారు. పదేళ్లకు ముందు ఆ గ్రామంలో మిగతా గ్రామాల మాదిరిగానే సారా, మద్యం అమ్మకాలు జరిగేవి. పెద్దల నుంచి పిన్నల దాకా అంతా మద్యానికి బానిసలై.. తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గ్రామస్తులంతా ఏకమై మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని తీర్మానించారు. అప్పటి నుండి గ్రామంలో మద్యం అమ్మకాల్లేవు. ఈ గ్రామస్తులు అన్నింటా చైతన్యాన్ని ప్రదర్శిస్తారు. అంగన్వాడీ, ఏఎన్ఎం, ఉపాధ్యాయులు విధులకు ఆలస్యంగా వస్తే నిలదీస్తారు. అందరూ అక్షరాలు నేర్చుకోవడంలో ముందున్నారు. గ్రామంలో 20 మందికిపైగా ఉన్నత విద్యావంతులు ఉన్నారు. అందరికీ మరుగుదొడ్లు మైదాన ప్రాంతంలోనే పూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణం జరగని పరిస్థితుల్లో అటవీ ప్రాంతంలో ఉన్న మొట్లతిమ్మాపురంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. గ్రామంలో 40 కుటుంబాలు ఉండగా అందరి ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ పల్లె బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా గుర్తింపు పొందింది. ఐకమత్యంగా ఉండే ఆ గ్రామంలో అన్ని రాజకీయపార్టీల సానుభూతిపరులు ఉన్నారు. ఎవరికి వారు తమ తమ పార్టీలకు మద్దతుదారులుగా ఉంటున్నా.. రాజకీయపరమైన విభేదాలు, పోటీల జోలికి వెళ్లరు. ఎన్నికలప్పుడు గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీనిచ్చే పార్టీ అభ్యర్థికే సమష్టిగా ఓట్లు వేయడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఒకచోట కూర్చొని సమస్యలను చర్చించుకుంటున్న గ్రామస్తులు పోటీలేదు.. ఇతర పంచాయతీల్లో అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడి డబ్బు ఖర్చుపెట్టి పదవులు కొనుక్కొంటున్న పరిస్థితి.. అందుకు భిన్నంగా నాపై నమ్మకంతో గ్రామస్తులంతా ఏకమై సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో అందరి అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నా. – బిజ్జ స్వరూప, సర్పంచ్ గ్రామస్తులు కలసికట్టుగా ఉంటారు కొత్తగా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పొందిన నాకు మొట్లతిమ్మాపురంలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు గ్రామస్తులంతా సహకరిస్తున్నారు. వివాదాల జోలికి వెళ్లరు. సమస్య వస్తే ఒక దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటారు. ఊరిలో మద్యం అమ్మకాల్లేవు. – బానోత్ నరేష్, పంచాయతీ కార్యదర్శి, మొట్ల తిమ్మాపురం రాజకీయాలతో సంబంధం లేదు మా ఊర్లో అన్ని పార్టీల జెండాలు ఉన్నాయి. అయితే ఆ జెండాలు మా మధ్య ఏనాడూ గొడవలు సృష్టించలేదు. పార్టీలతో సంబంధం లేకుండా అందరం ఊరి అభివృద్ధికి పాటుపడుతున్నాం. అందుకే మా ఊరి వాసులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి ఎదురుకాలేదు. – బూర్క పాపయ్య, గ్రామ వాసి చెప్పినట్లు వింటారు చిన్నపిల్లవాడి నుండి పెద్దల వరకు పెద్దమనుషులు చెప్పినట్లు వింటారు. ఏ సమస్య వచ్చినా అందరం కలిసి ఒక అభిప్రాయంతో పరిష్కరించుకుంటాం. సారా, మద్యం లేకపోవటంతో ఊరు ప్రశాంతంగా ఉంది. – బిజ్జ విశ్వనాథం, గ్రామ వాసి -
ఇబ్రహీంపూర్.. సూపర్
సాక్షి, సిద్దిపేట: ‘ఊరంటే ఇలా ఉండాలి.. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ సంక్షేమ పథకం ఇక్కడ అమలవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధుల్లో ప్రతీ పైసా సద్వినియోగం అవుతోంది. ఉపాధి హామీ పథకం అమల్లో ఇబ్రహీంపూర్ గ్రామం దేశాని కే ఆదర్శంగా నిలిచింది. మీ నాయకుడు హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధకు, మీ అందరి ఐక్యతకు అభినందనలు.. మీ గ్రామం నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం’ అని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. ఎన్ఐఆర్డీ ఆధ్వర్యంలో దేశంలోని 15 రాష్ట్రాల నుంచి వచ్చిన చీఫ్ విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హరియాణా విధాన సభ స్పీకర్ సహా మొత్తం 61 మందితోపాటు, 25 మంది ఐఏఎస్‌లు సిద్దిపేట నియోజకవర్గంలోని హరీశ్‌రావు దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వారికి స్వాగతం పలికారు. ప్రధానంగా ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా చేపట్టే 26 పనులు ఇబ్రహీంపూర్లో సంపూర్ణంగా అమలు జరగడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతీ పని గురించి ఫొటోలు తీసుకున్నారు. హరియాణా స్పీకర్ కుంపర్పాల్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపూర్ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇక్కడి పథకాలను తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని చెప్పారు. గ్రామస్వరాజ్యమే దేశ స్వరాజ్యం అనడానికి ఇబ్రహీంపూర్ గ్రామం నిదర్శనమని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కాపురాజయ్య పెయింటింగ్‌లు, మహిళా ప్రతినిధులకు సిద్దిపేట జిల్లాకు ప్రత్యేకతగా నిలిచే గొల్లభామ చీరలను అందజేశారు. ఐకమత్యంతోనే సాధ్యపడింది.. గ్రామస్తుల ఐకమత్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం ప్రవేశపెడితే దానిని ఇక్కడ అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. దక్షిణ భారత దేశంలోనే నగదు రహిత క్రయవిక్రయాలు అమలు చేసిన గ్రామంగా ఈ ఊరుకు పేరుందని చెప్పారు. ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించేందుకు వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు రావడం సంతోషంగా ఉందన్నారు. కొందరు విదేశీ ప్రతినిధులు కూడా గ్రామాన్ని సందర్శించి వెళ్లారని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇబ్రహీంపూర్ గ్రామం గురించి చర్చ జరగడం ఈ గ్రామస్తుల అదృష్టంగా ఆయన అభివర్ణించారు. గ్రామంలోని చిన్నా.. పెద్దా ఐక్యంగా ఉండటం అభినందనీయమని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. భవిష్యత్‌లో కూడా గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిస్తామని చెప్పారు. -
ఆదర్శ గ్రామంగా వన్నెల్(బి)
బాల్కొండ నిజామాబాద్ : నేరాల నియంత్రణకు పోలీసులతో సహకరించడంలో మండలంలోని వన్నెల్(బి) గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని సీపీ కార్తికేయ అన్నారు. గ్రామస్తులు రూ.2.7 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆర్మూర్ డివిజన్లో నేరాల నియంత్రణ కోసం గ్రామస్తులే స్వంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో వన్నెల్(బి) ముందుందన్నారు. సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణలో ప్రజలు అందరూ పోలీసులతో సహకరించాలన్నారు. అప్పుడే నేర రహిత సమాజం ఏర్పడుతుందన్నారు. సీసీ కెమెరాలతో అనేక ప్రయోజనలు ఉన్నాయని వివరించారు. కోర్టుల్లో పోలీసులు ప్రవేశపెడుతున్న సాక్ష్యాలకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఇతర గ్రామాల్లో కూడా వన్నెల్(బి) గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామస్తులను చైతన్యవంతులు చేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేల కృషి చేసిన బాల్కొండ ఎస్ఐ స్వామీగౌడ్ను, గ్రామస్తులను అభినందించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ శివకుమార్, ఆర్మూర్ రూరల్ సీఐ రమణరెడ్డి, స్థానిక సర్పంచ్ తాళ్ల భూషణ్, ఎంపీటీసీ రాజు, బాల్కొండ సహకార సంఘం అధ్యక్షుడు తూర్పు రమేశ్‌రెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కమ్యూనికేషన్ కార్యాలయం ప్రారంభం నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): జిల్లా కేంద్రంలోని పోలీస్‌లైన్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ కార్యాలయాన్ని శుక్రవారం సీపీ కార్తికేయ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నూతన హంగులతో ఏర్పాటు చేసిన ఈ భవనాన్ని సిబ్బంది చక్కగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నూతన భవనంలో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ సామగ్రి కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని చక్కగా వినియోగిస్తూ నేరాల నియంత్రణ కోసం వాడాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఆకుల రాంరెడ్డి, ఎన్ఐబీ, ఏఆర్ ఏసీపీలు సీహెచ్ మహేశ్వర్, రవీందర్, ఎస్బీ సీఐ రాజశేఖర్, ఆర్ఐ శేఖర్, శైలేందర్, రాంనిరంజన్, కమ్యూనికేషన్, ఎస్ఐలు నవీన్‌కుమార్, ఆర్ చంద్రబోస్ పాల్గొన్నారు. -
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ బోథ్ : మండలంలోని కుచులాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ అన్నారు. గురువారం గ్రామంలో శబ రిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడవాలని, భక్తితోనే ముక్తి లభిసుం్తదని అన్నారు. మంచి మనసుతో పనులన ు చేస్తే ఖచ్చితంగా విజయవంతమవుతాయని చెప్పారు. కాగా గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామి ఇచ్చారు. కాగా గడిచిన కాలంలో నియోజకవర్గంలో దాదాపు 400 బోర్లు వేయించామని, ఈ గ్రామంలో కూడా త్వరలోనే బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి 10 డబుల్ బెడ్రూం ఇళ్ళను మంజూరు చేయిస్తానని తెలి పారు. దళితులకు 3 ఎకరాల భూమి త్వరలోనే ఇవ్వబోతున్నామన్నారు. అనంతరం సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనసూయ, ఎంపీపీ గంగుల లక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి, వైస్ చైర్మన్ దావుల భోజారెడ్డి, ఎంపీటీసీలు సోలంకి సునీత, రాయల్, తెరాస మండల అధ్యక్షుడు రుక్మన్ సింగ్, నారాయణ రెడ్డి,మల్లేష్, జగన్, సత్యనారాయణ, దేవిదాస్, మంత్రి ప్రకాష్ పాల్గొన్నారు. -
ఆదర్శ గ్రామంలో పర్యటించిన ఎంపీ
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెం మండలంని ఆదర్శ గ్రామమైన గణపవరంలో వైఎస్సార్సీపీకి చెందిన ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం పర్యటించారు. శుక్రవారం రాత్రి అదే గ్రామంలో పల్లెనిద్ర చేసిన ఆయన శనివారం ఉదయం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. -
'నర్సన్నపేటను ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా'
జగదేవ్‌పూర్: మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని నర్సన్నపేటను ఎర్రవల్లిలాగానే ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారం నాడు మెదక్ జిల్లా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన నర్సన్నపేటలో ఆగారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడుతూ.. త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేస్తామన్నారు. భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు నష్టం లేకుండా తగిన చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నర్సన్నపేటను ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని కేసీఆర్ అన్నారు. -
ఎర్రవల్లి ఇక 'ఆదర్శ గ్రామం'
-
ఎర్రవల్లి ఇక 'ఆదర్శ గ్రామం'
ప్రభుత్వపరంగా డిక్లేర్ చేయిస్త గ్రామానికి సంబంధించిన అన్ని పనులకు సర్కార్‌దే బాధ్యత వ్యవసాయ అభివృద్ధికి 100 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధమే ఎర్రవల్లి విత్తనోత్పత్తి గ్రామంగా ఆవిర్భవించాలి 'స్వయంపాలిత-సమృద్ధి గ్రామం'గా మారాలె ఐకమత్యంతోనే అన్నీ సాధ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు గజ్వేల్: 'ఎర్రవల్లిని ప్రభుత్వపరంగా ఆదర్శ గ్రామంగా డిక్లేర్ చేయిస్తా. గ్రామానికి సంబంధించిన అన్ని పనులను ఇక సర్కార్ చూసుకుంటది. వ్యవసాయ రంగం అభివృద్ధికి అవసరమైతే రూ. 100 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధమే. మన ఊరిని విత్తనోత్పత్తి గ్రామంగా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుందాం. మీకో బ్యాంకును పెట్టిస్తా. మొత్తమ్మీద ఊరిని స్వయంపాలిత-సమృద్ధి గ్రామంగా మార్చుకుందాం'అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లి గ్రామంపై వరాల జల్లు కురిపించారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా 10 రోజుల కిందట మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో పర్యటించిన కేసీఆర్...శనివారం సాయంత్రం మరోమారు ఎర్రవల్లిని సందర్శించారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించనున్న స్థలాన్ని, శిథిలమైన ఇళ్ల కూల్చివేత పనులను ఆయన పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, 'గడా' ఓఎస్డీ హన్మంతరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే... నిన్న మీరంతా నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు పోయి వచ్చారు కదా. ఆ ఊరు ఎట్లుంది. మనం ఎందుకు అట్ల కావొద్దు. ముందుగాల ఇళ్ల నిర్మాణ పనులు, ఊరిని శుభ్రం చేసుకునే పనులు చేసుకుందాం. ఆ తర్వాత వ్యవసాయరంగ అభివృద్ధి పనులు మొదలు పెడదాం. వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామంలోని భూములన్నింటికీ భూసార పరీక్షలు చేస్తరు. దానిని బట్టి పంటలు వేసుకుందాం. వరి పంట బంద్జేద్దాం. ఇంకా విత్తనోత్పత్తి పంటలే వేసుకుందాం. నేను సీడు కంపెనీలతో మాట్లాడుతా. మీరు ఉత్పత్తి చేసిన విత్తనాలు వారు తీసుకుపోతరు. మంచి లాభం ఉంటది. ఊల్లె ఒక్క గుంట జాగ కూడా వేస్ట్ కావొద్దు. మంచి భూములు మనయ్. తెలంగాణలో ఏ గ్రామానికీ లేని సౌకర్యం మీకుంది. ముఖ్యమంత్రి అయిన నేను మీ ఊరు వ్యక్తిని. నేనే కాదు ప్రభుత్వ యంత్రాంగమంతా మీ వెంట ఉంటది. పనులెందుకు కావ్? అందరికీ బోర్లు వేయిస్త. డ్రిప్ సిస్టమ్ పెట్టుకుందాం. నీళ్ల నిల్వకు కుండీలు కట్టుకుందాం. ఇంటింటికీ బర్రెలు ఇప్పిస్త. పాడిరంగాన్ని అభివృద్ధి చేసుకుందాం. జరంత భూమి ఉన్నోళ్లకు కూరగాయల పంటలు పండించేలా చేద్దాం. దళితుల భూములను బాగజేపిస్త. వారికి గతంలో పంపిణీ చేసిన భూముల్లో కొంత బాగలేదు. అంత సాఫ్ జేపిస్త. అక్కడ కూడా బంగారు పంటలు పండేట్లు చేసుకుందాం. గ్రామంలో జాగలన్నీ సక్కగ లేవు. ఒక్కో రైతుకు ఆడింత, ఈడింత జాగుంది. రైతుల మధ్య అవగాహనతో హద్దు బదులు చేసుకుందాం. దీని ద్వారా ఒక్క దగ్గరనే ఎక్కువ భూమి అయితది. పూర్తిగా భూమి లేనోళ్లకు ఫౌల్ట్రీ ఫారాలు పెట్టిద్దాం. ఎస్సీ, బీసీ పిల్లలకు సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇస్త. వచ్చే వానాకాలం వరకు లోకమంతా వచ్చి ఈ ఊరినే చూసెటట్టు కావాలె. ఇవ్వన్నీ జరగాలంటే ఐకమత్యం చాలా అవసరం. ఎవరింట్లయినా పెండ్లయితే ఇంటికో రూ. 50 చొప్పున సాయం జేయండి. ఆ కుటుంబం అప్పులపాలు కాకుండా ఉంటది. ఊర్ల ఉండెటోళ్లకే ఇండ్లు... 'ఊర్ల నివాసం ఉండెటోళ్లకే ఇండ్లు ఇస్తం. 30, 40 ఏళ్ల కిందట ఇతర ప్రాంతాలకు వలస పోయి అక్కడ ఇండ్లు కట్టుకున్నోళ్లకు ఎట్ల ఇస్తం' అంటూ సీఎం స్పష్టం చేశారు. గ్రామానికి చెందిన పలువురు ఇండ్ల జాబితాలో తమను చేర్చుకోవడం లేదని సీఎం దృష్టికి తీసుకురాగా పైవిధంగా స్పందించారు. గ్రామానికి చెందిన అన్ని కులాలతో కూడిన కమిటీ ఇళ్ల జాబితాను సిద్ధం చేసి గ్రామసభలో చదవాలని, ఎవరివైనా పేర్లు రాకపోతే మరో అవకాశం కల్పించాలని ఆదేశించారు. రాఖీ కట్టిన సర్పంచ్... ఎర్రవల్లి గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్‌కు గ్రామ సర్పంచ్ భాగ్య రాఖీ కట్టారు. అనంతరం పాదాభివందనం చేసి సీఎంతోపాటు సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
17న గంగదేవిపల్లికి సీఎం
‘గ్రామజ్యోతి’ని ప్రారంభించనున్న కేసీఆర్ {పజల ఐకమత్యం, పనిలో భాగస్వామ్యం ఇదీ గంగదేవిపల్లి ప్రత్యేకత గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లి మరోసారి వార్తలకెక్కింది. సీఎం కేసీఆర్ ఈ గ్రామాన్ని సందర్శించనున్నారు. ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే కేసీఆర్ లాంఛనంగా ఆగస్టు17వ తేదీన ప్రారంభిస్తారు. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 24వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు స్వయంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో గురువారం జరిగిన మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో వెల్లడించారు. అనేక ప్రత్యేకతలతో దేశంలోనే ఆదర్శగ్రామంగా గుర్తింపు తెచ్చుకున్న గంగదేవిపల్లి ఇప్పటికే దేశవిదేశీయులను ఆకర్శిస్తోంది. ముఖ్యంగా ప్రతీ పనికి ఓ కమిటీని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా పనులను చేయడం, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత. 2004లో ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన గ్రామం ఆ తర్వాత అనేక సొబగులు అద్దుకుంది. గంగదేవిపల్లి ప్రత్యేకతలు.. ►వంద శాతం కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకోవడం. ►{పతీ కుటుంబం చిన్న మొత్తాల పొదుపు చేయడం ►{పతీ కుటుంబానికి బ్యాంకు అకౌంట్ ఉండటం ►అర్హులైన ప్రతీ కుటుంబం కుటుంబ నియంత్రణ పాటించడం ►తమ ఇంటి ముందు రోడ్డును ఆయూ కుటుంబాలు ఊడ్చుకోవడం, పరిశుభ్రతను పాటించడం. ► మద్యం అమ్మకాలు లేకపోవడం బాలకార్మికులు లేకపోవడం ►తాగునీరు వృథా చేసినా, బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేసినా రూ. 500 జరిమానా విధిస్తారు. ►కేంద్ర ప్రభుత్వ చేపట్టిన స్వచ్ఛభారత్‌కు ఈ గ్రామం స్ఫూర్తిగా నిలుస్తోంది. ►ఇప్పటి వరకు గ్రామాన్ని సుమారు 76 దేశాల ప్రతినిధులు సందర్శించారు. ►స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద గంగగేవిపల్లిని ఎంపిక చేసి గ్రామాభివృద్ధిపై రూపొందించిన డాక్యుమెంటరీని న్యూఢిల్లీలో వీక్షించారు. ►గంగదేవిపల్లి ప్రజల ఐకమత్యాన్ని, పనుల్లో భాగస్వామ్యాన్ని కొనియాడారు. ఎన్నో అవార్డులు.. ►2007 మే 4వ తేదీన అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా నిర్మల్ గ్రామ్ పురస్కారాన్ని సర్పంచ్ కూసం రాజమౌళి అందుకున్నారు. జిల్లాలో ఈ అవార్డు పొందిన తొలిగ్రామం గంగదేవిపల్లి ►2008 నవంబర్1న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా శుభ్రం అవార్డును సర్పంచ్ కూసం రాజమౌళికి అందుకున్నారు. ►2010లో గూగుల్ సంస్థ వారు గూగుల్ గ్రామపంచాయతీ అవార్డుకు గ్రామాన్ని ఎంపిక చేసి రూ. 5 లక్షలు అందించారు. ►2007న ఆంధ్రా బ్యాంకు వారు పట్టాభి ఆదర్శగ్రామంగా ప్రకటించారు. ►2007లో భారతరత్న రాజీవ్‌గాంధీ అత్యుత్తమ గ్రామపంచాయతీ జాతీయస్థాయి అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ►సినీ హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సందర్భంగా తెలంగాణలో మొట్టమొదటి సారిగా గంగదేవిపల్లిని సందర్శించారు. -
ఎన్నాళ్లీ నిరీక్షణ!
సత్తెనపల్లి: తమ గ్రామం ఆదర్శంగా ఉండాలని, ప్రజలందరూ కలిసి పార్టీలకతీతంగా పాలకులనుఎన్నుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే నజారానాలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామనుకున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగి ఏడాది గడిచింది. అయినా నిధుల జాడలేదు. రోడ్లు, కాల్వలు, అధ్వానంగా తయారయ్యాయి. పారిశుద్ధ్యం లోపించింది. నిధులు లేక గ్రామాల్లో సమస్యలే రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధి పనులు చేపట్టలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక ఏకగ్రీవ పంచాయతీల సర్పంచ్‌లు తలలుపట్టుకుంటున్నారు. కులమతాలకు, వర్గ విభేదాలకు తావులేకుండా గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్‌లను, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పంచాయతీలకు 2006లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నజరానా ప్రవేశపెట్టారు. మేజరు పంచాయతీకి రూ.15 లక్షలు, మైనర్ పంచాయతీకి రూ.7 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించారు. ఆ నిధులను గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనులకు వినియోగించే వారు. ప్రస్తుతం ప్రభుత్వమిచ్చే నజరానాల కోసం ఏకగ్రీవ పంచాయతీలకు ఎదురుచూపులే మిగిలాయి. ఎన్నికలు ముగిసి ఏడాది గడిచినా నిధుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ప్రస్తుత శాసనమండలి సమావేశాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవమైన పంచాయతీలకు త్వరలో ప్రోత్సాహక నిధులు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తుండగా ఇంకా త్వరలో అంటూ ప్రకటనలు చేయడం నిధుల విడుదలపై సందేహాలకు తావిస్తోంది. సమస్యలే నజరానా.. సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో మొత్తం 67 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో 14 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఆయా పంచాయతీల్లో ప్రజలు తాగునీరు, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వంటి మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రోత్సాహక నిధులు వస్తే సమస్యలు పరిష్కరించ వచ్చని ఆశపడ్డ సర్పంచ్ల ఆశలు ఫలించలేదు. నజరానాల కోసం నిరీక్షణ తప్పలేదు. ప్రభుత్వం చొరవ చూపాలి... రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆలస్యంగానైనా ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా వస్తుందని ఎదురు చూస్తున్నాం. పంచాయతీలో సమస్యలు అధికంగా ఉన్నాయి. ఏపని చేయాలన్నా నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రోత్సాహక నగదు అందితేనే సమస్యలు తీరుతాయి. ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. - చెవులు వకులేశ్వరరావు, సర్పంచ్, కట్టావారిపాలెం నజరానాల ఊసేది? ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామాలకు ఏడాది గడిచినా ప్రోత్సాహక నిధులు విడుదల చేయలేదు. చాలీచాలని నిధులతో గ్రామంలో మెరుగైన వసతులు కల్పించలేకపోతున్నా. నజరానా నిధులు మంజూరైతే గ్రామాల్లో శాశ్వత పనులకు ప్రాధాన్యం కల్పించి అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని నమ్మి ప్రజలంతా సమష్టిగా నన్ను ఎన్నుకున్నారు.త్వరితగతిన ప్రభుత్వ నిధులు విడుదల చేయాలి. -ఎస్కె.మహబూబ్ బీ, సర్పంచ్, మొక్కపాడు -
ఆదర్శగ్రామాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రైతులు
ఆర్మూర్ : వ్యవసాయాన్ని ఆధునిక పద్దతిలో చేస్తూ అధిక దిగుబడులను రాబట్టి లాభాలు పోందుతూ రాష్ట్రంలోనే ఆదర్శగ్రామంగా నిలిచిన అంకాపూర్ గ్రామాన్ని పలు జిల్లాలకు చెందిన రైతులు సందర్శించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామం వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతిలో చేస్తూ ముందంజలో ఉంది. ఆ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు సందర్శించారు. వారు ఆ గ్రామంలోని రైతులు అనుసరిస్తున్న నూతన వ్యవసాయ పద్ధతులను అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. -
ప్రతి గ్రామం.. ఆదర్శ గ్రామం కావాలి
ఎంపీ కవిత హాసాకొత్తూర్ (కమ్మర్పల్లి) : ఎందరో త్యాగధనుల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం ఆదర్శ గ్రామం కావాలన్నదే తన ఆశయమని ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బుధవారం కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్‌లో కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న 33/11 కె.వీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు అవుతున్నప్పటికీ, ఇంకా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో వెనకబడ్డామన్నారు. గ్రామీణ ఆవాస్ యోజన కింద ప్రతి ఎంపీ మూడు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఉందన్నారు. తన పరిధిలో 30 మండలాలున్నాయని, మండలంలో ఏడాదికి ఒక్క గ్రామం తీసుకొని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామాల్లోని అన్ని చెరువులను ఇరిగేషన్ ప్రాజెక్ట్ కిందకు తెచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సమస్య ఇప్పటిది కాదని, గత పాలకుల తప్పిదాల వల్లే సంక్షోభం నెలకొందన్నారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణలో విద్యుత్ సమస్య ఉండేదని, అదే వారసత్వంగా కొనసాగుతోందన్నారు. హాసాకొత్తూర్ నుంచి మెట్ల చిట్టాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. మాయ మాటలు నమ్మొద్దు.... టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, చేపడుతున్న సంస్కరణలతో కొన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నాయని, వాటి మాటలను నమ్మొద్దని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని అప్పట్లో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినా అప్పటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. అప్పటి డిమాండ్ మేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఇన్పుట్ సబ్సిడీ రూ. 478 కోట్లు చెల్లించిందన్నారు. హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం నీటి పంపకాల విషయమై కొనసాగుతున్న వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. గట్టుపొడిచిన వాగు కాలువల నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేయిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గడ్డం సుమనరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, జడ్పీటీసీ సభ్యులు దాసరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.