'ఎర్రవల్లిని ప్రభుత్వపరంగా ఆదర్శ గ్రామంగా డిక్లేర్ చేయిస్తా. గ్రామానికి సంబంధించిన అన్ని పనులను ఇక సర్కార్ చూసుకుంటది. వ్యవసాయ రంగం అభివృద్ధికి అవసరమైతే రూ. 100 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధమే. మన ఊరిని విత్తనోత్పత్తి గ్రామంగా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుందాం. మీకో బ్యాంకును పెట్టిస్తా. మొత్తమ్మీద ఊరిని స్వయంపాలిత-సమృద్ధి గ్రామంగా మార్చుకుందాం'అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లి గ్రామంపై వరాల జల్లు కురిపించారు