ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెం మండలంని ఆదర్శ గ్రామమైన గణపవరంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం పర్యటించారు. శుక్రవారం రాత్రి అదే గ్రామంలో పల్లెనిద్ర చేసిన ఆయన శనివారం ఉదయం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.