వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ..
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలపై వారు ఈ సందర్భంగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ సీపీ నేతలు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు సోమవారం గవర్నర్తో భేటీ అయ్యారు.
తమ పార్టీ ఎంపీటీసీలను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. కొంతమంది ఎంపీటీసీలను కొనేందుకు బహిరంగానే డబ్బులు ఇచ్చిన విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తెచ్చారు. ప్రలోభాలకు పాల్పడుతున్న టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను పోటీ నుంచి డిస్మిస్ చేయాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేతలు కిడ్నాప్ చేసిన వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తిరిగి వచ్చేవరకు ఎన్నికలు నిలిపివేయాలని కోరారు. గవర్నర్తో భేటీ అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఒకవేళ న్యాయం జరగపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.