
'నర్సన్నపేటను ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా'
జగదేవ్పూర్: మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలంలోని నర్సన్నపేటను ఎర్రవల్లిలాగానే ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారం నాడు మెదక్ జిల్లా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన నర్సన్నపేటలో ఆగారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడుతూ.. త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేస్తామన్నారు.
భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు నష్టం లేకుండా తగిన చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నర్సన్నపేటను ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని కేసీఆర్ అన్నారు.