భార్య పుట్టింటికి వెళ్లిందని.
Published Tue, Aug 16 2016 12:32 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM
వెంకటాపురం: భార్య పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే శ్రీనివాస్(38) అనే వ్యక్తి మద్యం తాగి.. ఆ మత్తులో పురుగుల మందు తాగాడు. స్థానికులు అతన్ని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. భార్య పుట్టింటికి వెళ్లినప్పటి నుంచి మద్యం మత్తులోనే ఉంటున్నాడని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement