కలెక్టరేట్ ఎదుట వ్యక్తి మృతి
అనంతపురం సెంట్రల్ : నగరంలోని ఉమానగర్‌కు చెందిన టి. బాలాజీనాయుడు(52) శుక్రవారం వ్యక్తిగత పని నిమిత్తం సంగమేష్ సర్కిల్ నుంచి ఎస్కేయూ వైపు ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. ఎస్కేయూ నుంచి వస్తున్న లారీ కలెక్టరేట్ ఎదురుగా చెరువుకట్ట వైపు తిరుగుతూ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. బాలాజీనాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. 20 నిమిషాలైనా 108 వాహనం సంఘటన స్థలానికి చేరుకోకపోవడంతో స్థానికులు, పోలీసులు ప్రైవేటు వాహనంలో క్షతగ్రాతుడిని సర్వజనాస్పత్రికి తరలించారు.
అప్పటికే పరిస్థితి విషమించడంతో కాసేపటికే మృతి చెందాడు. బాలాజీనాయుడుకు భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీని వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. లారీని ట్రాఫిక్ ఎస్‌ఐలు జాకీర్‌హుస్సేన్, లక్ష్మినారాయణలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకున్నారు.