వ్యక్తి దారుణ హత్య | man murdered | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Published Wed, Feb 15 2017 12:48 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

man murdered

కళ్యాణదుర్గం : మండల పరిధిలోని వర్లి గ్రామానికి చెందిన రమేష్‌ నాయక్‌ (47) మంగâýæవారం తెల్లవారుజామున దారుణహత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన జయరాం నాయక్‌ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడి సోదరుడు సత్యనారాయణ, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రమేష్‌ నాయక్, జయరాం నాయక్‌ ఇద్దరూ బంధువులు. వీరిద్దరికీ ఇంటి ముందు స్థల వివాదం ఉండేది. భూ వివాదాల్లో సైతం ఇద్దరూ గతంలో ఘర్షణ పడ్డారు. అంతేకాక ఇద్దరూ కుందేâýæ్లవేటకు వెళ్లేవారు.

ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పొద్దుపోయాక జయరాం నాయక్, రమేష్‌ నాయక్‌ను తన ఇంటికి పిలిపించుకున్నాడు. విందు ముగిశాక ఇద్దరి మధ్య చిన్న విషయమై ఘర్షణ నెలకొంది. క్షణికావేశంలో జయరాం నాయక్‌ గడ్డపారతో రమేష్‌ నాయక్‌ తలపై బాదాడు. దీంతో రమేష్‌నాయక్‌ అక్కడకక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితుడు పోలీసుస్టేçÙ¯ŒSలో లొంగిపోయినట్లు సమాచారం. రూరల్‌ ఎస్‌ఐ నబీరసూల్‌ సంఘటన స్థలాన్ని సందర్శించి మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రమేష్‌ నాయక్‌ ఇది వరకే పలు కేసుల్లో శిక్ష కూడా అనుభవించాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement