ramesh naik
-
ఇద్దరు యువకుల దుర్మరణం
- లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం - మాంసపు ముద్దలా మృతదేహాలు నల్లమాడ : ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఎస్ఐ కె.గోపి తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పులగంపల్లి సమీపాన కదిరి–హిందూపురం రహదారిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుటాగుళ్ల తారకరామనగర్‌కు చెందిన మూడే మహేష్‌నాయక్(24), నల్లచెరువు మండలం బాలేపల్లికి తండాకు చెందిన భూక్యా రమేష్‌నాయక్(24) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో కంతు చెల్లించేందుకు వెళ్లి.. సమీప బంధువులైన వీరు హిందూపురంలో ఆటో కంతు (ప్రీమియం) చెల్లించి ద్విచక్ర వాహనంలో కదిరికి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యంలో పులగంపల్లికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని రోడ్డు మలుపులో కదిరి వైపు నుంచి ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని బలంగా ఢీకొట్టారు. లారీ కుడివైపు, ద్విచక్ర వాహనం ముందు వైపు నుజ్జునుజ్జు అయ్యాయి. ద్విచక్ర వాహనం లారీ కింద ఇరుక్కుపోవడంతో.. మహేష్‌నాయక్, రమేష్‌నాయక్ మీదుగా లారీ కుడివైపు ముందు చక్రం దూసుకెళ్లింది. దీంతో మహేష్‌నాయక్ తల ఛిద్రమయింది. రమేష్‌నాయక్ ఎడమకాలు తొడవద్దకు విరిగిపోయి మృతదేహాలు మాంసం ముద్దల్లా తయారయ్యాయి. సమాచారం అందిన వెంటనే నల్లమాడ, అమడగూరు ఎస్ఐలు కె.గోపీ, చలపతి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జాకీ సాయంతో లారీని పైకి లేపి మృతదేహాలను, ద్విచక్ర వాహనాన్ని బయటకు తీశారు. కదిరి పట్టణ సీఐ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులిద్దరికీ భార్య, కూతరు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ గోపి తెలిపారు. -
వ్యక్తి దారుణ హత్య
కళ్యాణదుర్గం : మండల పరిధిలోని వర్లి గ్రామానికి చెందిన రమేష్ నాయక్ (47) మంగâýæవారం తెల్లవారుజామున దారుణహత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన జయరాం నాయక్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడి సోదరుడు సత్యనారాయణ, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రమేష్ నాయక్, జయరాం నాయక్ ఇద్దరూ బంధువులు. వీరిద్దరికీ ఇంటి ముందు స్థల వివాదం ఉండేది. భూ వివాదాల్లో సైతం ఇద్దరూ గతంలో ఘర్షణ పడ్డారు. అంతేకాక ఇద్దరూ కుందేâýæ్లవేటకు వెళ్లేవారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పొద్దుపోయాక జయరాం నాయక్, రమేష్ నాయక్‌ను తన ఇంటికి పిలిపించుకున్నాడు. విందు ముగిశాక ఇద్దరి మధ్య చిన్న విషయమై ఘర్షణ నెలకొంది. క్షణికావేశంలో జయరాం నాయక్ గడ్డపారతో రమేష్ నాయక్ తలపై బాదాడు. దీంతో రమేష్‌నాయక్ అక్కడకక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితుడు పోలీసుస్టేçÙ¯ŒSలో లొంగిపోయినట్లు సమాచారం. రూరల్ ఎస్ఐ నబీరసూల్ సంఘటన స్థలాన్ని సందర్శించి మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రమేష్ నాయక్ ఇది వరకే పలు కేసుల్లో శిక్ష కూడా అనుభవించాడు. -
నేడు గిరిజనుల మహాదీక్ష
జడ్చర్ల టౌన్ : ఎస్టీ రిజర్వేషన్లు 10శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణంలోని ఎర్రసత్యం స్మారక బస్టాండ్ సమీపంలో మహాదీక్ష నిర్వహిస్తున్నట్లు గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్‌నాయక్ తెలిపారు. సదస్సుకు లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాస్రాంనాయక్తోపాటు ఆయా పార్టీల నాయకులు హాజరవుతారని తెలిపారు. సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు తరలి రావాలని కోరారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి..
- ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన కొల్చారం(మెదక్) ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామ శివారులో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. మెదక్ రూరల్ సీఐ రామక్రిష్ణ, కొల్చారం ఎస్సై రమేష్‌నాయక్ గ్రామస్థుల కథనం ప్రకారం... ఎనగండ్ల గ్రామానికి చెందిన మంగలి గణేష్(35) ఐదేళ్లుగా భార్య లలిత, ఇద్దరు కుమారులతో కలిసి పటాన్ చెరువుకు సమీపంలోని బీరంగూడలో కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్వగ్రామంలోని సొంతిల్లు కూలిపోవటంతో కొత్త ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు పెట్టి వస్తానంటూ నాలుగు రోజుల క్రితం బీరంగూడ నుంచి ఎనగండ్లకు వెళ్లాడు. మూడు రోజులవుతున్నా భర్త జాడ కానరాకపోవడం, ఫోన్‌చేసినా సమాచారం లేకపోవడంతో లలిత పిల్లలతో కలిసి ఆదివారం ఎనగండ్ల గ్రామానికి చేరుకుంది. ఈ క్రమంలోనే గ్రామ శివారులోని దామర చెరువు వద్ద పొదల్లో గణేష్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకొని గణేష్ మృతదేహాన్ని పరిశీలించారు. గణేష్ మెడ, పొట్ట భాగంలో కత్తిపోట్ల ఆనవాళ్లున్నాయి. డ్వాగ్‌స్వ్కాడ్‌ను రప్పించగా అది మృతదేహం వద్ద నుంచి లలిత వద్దకు వచ్చి ఆగిపోయింది. ఈ మేరకు ఎస్సై రమేష్‌నాయక్ కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు
సాక్షి, బళ్లారి : జిల్లాలో వేర్వేరు ఘటనల్లో నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. సండూరు పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న సరస్వతి, జలజాక్షి, కూడ్లిగి పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న రమేష్ నాయక్, హిరేహడలి పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న గోపికృష్ణను సస్పెండ్ చేశారు. ఒక మహిళను అకారణంగా చితకబాదారనే ఆరోపణలపై సరస్వతి, వనజాక్షిని సస్పెండ్ చేశారు. కూడ్లిగి తాలూకాలోని గుడేకోట పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ బళ్లారి నుంచి గుడేకోటకు బస్సులో వెళుతుండగా రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తాను కానిస్టేబుల్‌నని చెప్పినా అతను తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని పేర్కొంటూ ఆమె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రాఘవేంద్రను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ రమేష్ నాయక్ స్టేషన్‌కు చేరుకుని రాఘవేంద్ర నాయక్‌కు మద్దతుగా మాట్లాడాడు. బస్సులో జనం ఉన్నప్పుడు మనిషి, మనిషి తగలడం సహజమేనని సమర్ధించాడు. అతన్ని విడుదల చేయాలని ఎస్ఐను నిలదీశాడు. ఈ విషయంపై ఎస్ఐ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్ రమేష్ నాయక్‌ను విచారించిన ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. అదేవిధంగా విధులకు సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆరోపణలపై హిరేహడలి కానిస్టేబుల్ గోపీకృష్ణను సస్పెన్షన్ చేశారు. -
శుభలేఖలు ఇచ్చేందుకు వెళుతూ..
పెద్దమండ్యం: చెల్లెలు వివాహానికి శుభలేఖలు ఇచ్చేందుకు బయలుదేరిన ఓ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ సంఘటన బుధవారం పెద్దమండ్యం-గాలివీడు రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు .. వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం పందికుంట తాండాకు చెందిన కృష్ణానాయక్‌కు కుమారుడు రమేశ్‌నాయక్ (27), కూతురు కవిత ఉన్నారు. కవిత కు అదే తాండాకు చెందిన రాజానాయక్‌తో శనివారం వివాహం జరుగనుంది. దీనికి సంబంధించి బంధువులకు శుభలేఖలు ఇచ్చేందుకు కలిచెర్లకు ద్విచక్రవాహనంలో రమేశ్‌నాయక్ బయలుదేరా డు. పెద్దమండ్యం-గాలివీడు రహదారిపై నమాజుకట్ట మలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న స్కూల్‌వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. వాహనా న్ని నడుపుతున్న రమేశ్‌నాయక్ తీవ్రం గా గాయపడ్డారు. అటుగా వస్తున్న వారు తీవ్రంగా గాయపడిన రమేశ్‌నాయక్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే తీవ్రగాయాలు కావడంతో రమేశ్‌నాయక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనుక కూర్చొని ఉన్న పెద్దమండ్యం మండలం కలిచెర్లకు చెందిన అబ్దుల్ (12)కు స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన అబ్దుల్‌ను చికిత్స నిమిత్తం స్థానికులు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రమాద స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మనోహర్ తెలిపారు. రోదించిన కుటుంబసభ్యులు చెల్లెలు వివాహానికి శుభలేఖలు ఇ చ్చేందుకు వెళుతూ రమేష్‌నాయక్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఒక్కగానొక్క కొడుకైన రమేశ్ మృతితో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.