హిందూపురం అర్బన్ : బుద్ధిమాంద్యం బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో సికిందర్ అనే యువకుడు పక్కింట్లో స్నానం చేస్తున్న బుద్ధిమాంద్య బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. స్నానపు గదిలోంచి శబ్దాలు రావడంతో కుటుంబ సభ్యులు రావడంతో యువకుడు పారిపోవడానికి ప్రయత్నించి కిందపడ్డాడు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ ఈదుర్‌బాషా, ఎస్‌ఐ మహబూబ్‌బాషా తెలిపారు.