sikindar
-
వైజాగ్ నేవీ మారథాన్ విజేతలు శిఖంధర్, ఆశా
విశాఖ స్పోర్ట్స్: విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన వైజాగ్ నేవీ మారథాన్ 8వ ఎడిషన్ ఓపెన్‌లో శిఖంధర్, మహిళల్లో ఆశా విజేతలుగా నిలిచారు. వైజాగ్ నేవీ మారథాన్ పరుగు సాగరతీరంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి అథ్లెట్లు విజయమే లక్ష్యంగా ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల పరుగుపెట్టారు. ఔత్సాహికులు సరదాగా ఐదు కిలోమీటర్ల మేర ఫన్ రన్ చేపట్టారు. ఫుల్ మారథాన్ 42.2 కిలోమీటర్లు, హాఫ్ మారథాన్ 21.1 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల రేస్‌ను నిర్వహించి విజేతలకు బహుమతులందించారు. మారథాన్ రేస్, ఫన్ పరుగు ఆర్కే బీచ్ మీదుగా నేవల్ కోస్టల్ బ్యాటరీ వైపు వద్ద యూటర్న్ తీసుకుని.. కాళీమాత ఆలయం మీదుగా వీఎంఆర్డీఏ ఎంజీఎం పార్క్ వద్దకు చేరుకోగానే ముగిసింది. పది కిలోమీటర్ల పరుగు తెన్నేటి వద్ద యూ టర్న్ తీసుకోగా, హాఫ్ మారథాన్ పరుగు వీరులు రుషికొండ గాయత్రి కళాశాల దగ్గర యూ టర్న్ తీసుకున్నారు. పూర్తి మారథాన్‌లో అథ్లెట్లు ఐఎన్ఎస్ కళింగ సమీపంలోని చేపాలుప్పాడ దగ్గర యూ టర్న్ తీసుకుని ప్రారంభస్థానానికి చేరుకున్నారు. వీఎంఆర్డీఏ పార్క్‌లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పురుషుల ఓపెన్ హాఫ్ మారథాన్‌లో దీపక్ కుంబార్, 10 కిలోమీటర్ల పరుగులో సోనుకుష్వా విజేతలుగా నిలిచారు. మహిళా విభాగం హాఫ్ మారథాన్‌లో లిలియన్ రుట్టో, 10 కిలోమీటర్ల పరుగులో మేరీగ్రేస్ విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు. -
బుద్ధిమాంద్యం బాలికపై అత్యాచారయత్నం
హిందూపురం అర్బన్ : బుద్ధిమాంద్యం బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో సికిందర్ అనే యువకుడు పక్కింట్లో స్నానం చేస్తున్న బుద్ధిమాంద్య బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. స్నానపు గదిలోంచి శబ్దాలు రావడంతో కుటుంబ సభ్యులు రావడంతో యువకుడు పారిపోవడానికి ప్రయత్నించి కిందపడ్డాడు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ ఈదుర్‌బాషా, ఎస్ఐ మహబూబ్‌బాషా తెలిపారు. -
సికిందర్లో రోడ్లను నిర్భందించిన గుజ్జర్లు
-
నాగ్ అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా ఐదుసార్లు చూశా
అభిమానం ఎక్కువైనా ఒకోసారి నటీనటులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సంఘటనపై ప్రముఖ హీరో నాగార్జునకు ఎదురైంది. అదీ కూడా సినీ ప్రముఖుల సమక్షంలో ఓ వీరాభిమాని తన మనసులో మాటను బయటపెట్టి మరీ తన అభిమానాన్ని చాటుకున్నాడు. సూర్య, సమంత జంటగా నటించిన సికిందర్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఈ సంఘటనకు వేదిక అయ్యింది. మాటలు, పాటల రచయిత వెన్నెలకంటి శశాంక్ మాట్లాడుతూ తాను నాగార్జున వీరాభిమాని అని... ఆయన నటించిన అట్టర్ ప్లాప్ చిత్రాలు కూడా అయిదుసార్లు చూశానంటూ వెల్లడించాడు. దాంతో నాగ్ ఒకింత ఇబ్బందిగా ఫీల్ అయినా వెంటనే నవ్వేశారు. నాగార్జునతో పాటు ఆ వేడుకకు హాజరైన సినీ ప్రముఖులు కూడా శశాంక్ మాటలకు చిరునవ్వులు చిందించారు. నాగార్జునను ప్రత్యక్షంగా చూడటం తనకు చాలా సంతోషకరంగా ఉందని శశాంక్, ఈ వేడుక తనకు చాలా చాలా స్పెషల్ అంటు ముగించాడు.