నాగ్ అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా ఐదుసార్లు చూశా
అభిమానం ఎక్కువైనా ఒకోసారి నటీనటులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సంఘటనపై ప్రముఖ హీరో నాగార్జునకు ఎదురైంది. అదీ కూడా సినీ ప్రముఖుల సమక్షంలో ఓ వీరాభిమాని తన మనసులో మాటను బయటపెట్టి మరీ తన అభిమానాన్ని చాటుకున్నాడు. సూర్య, సమంత జంటగా నటించిన సికిందర్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఈ సంఘటనకు వేదిక అయ్యింది.
మాటలు, పాటల రచయిత వెన్నెలకంటి శశాంక్ మాట్లాడుతూ తాను నాగార్జున వీరాభిమాని అని... ఆయన నటించిన అట్టర్ ప్లాప్ చిత్రాలు కూడా అయిదుసార్లు చూశానంటూ వెల్లడించాడు. దాంతో నాగ్ ఒకింత ఇబ్బందిగా ఫీల్ అయినా వెంటనే నవ్వేశారు. నాగార్జునతో పాటు ఆ వేడుకకు హాజరైన సినీ ప్రముఖులు కూడా శశాంక్ మాటలకు చిరునవ్వులు చిందించారు. నాగార్జునను ప్రత్యక్షంగా చూడటం తనకు చాలా సంతోషకరంగా ఉందని శశాంక్, ఈ వేడుక తనకు చాలా చాలా స్పెషల్ అంటు ముగించాడు.