- బేస్ క్యాంప్‌కే పరిమితమైన బలగాలు
దుమ్ముగూడెం: ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోని అటవీప్రాంతంలో పోలీసుల రాకపోకలను అడ్డుకోవడానికి మావోయిస్టులు కందకాలు తవ్వుతున్నట్లు తెలిసింది. ధర్మపేట ప్రధాన రహదారులను నిర్బంధించి శనివారం సాయంత్రం నుంచి మావోయిస్టు మిలీషియా సభ్యులు ఈ కందకాలను తవ్వుతున్నట్లు తెలిసింది.
ఇదే ప్రాంతంలో ధర్మపేట బేస్ క్యాంప్ ఉన్నప్పటికీ కోయ కమాం డోలు అందుబాటులో లేకపోవడం తో సీఆర్‌పీఎఫ్ బలగాలు బయటకు రాకుం డా క్యాంప్‌నకే పరిమితమైనట్లు తెలుస్తోంది. గ్రామాల్లోకి పోలీసులను రానివ్వవద్దని, బేస్ క్యాంపుల నిర్మాణాలను అడ్డుకోవాలని, సంతలను బంద్ చేయాలని, సరుకులను సరఫరా చేయొద్దని ఆయా ఆదివాసీ గ్రామాల ప్రజలకు మావోయిస్టులు సూచనలు చేశారు.