sukuma district
-
మూడు క్యాంపులపై మావోయిస్టుల దాడి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు గ్రామం మావోయిస్టులు, జవాన్ల పరస్పర కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దండకారణ్య ప్రాంతంలోని బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లో ఏర్పాటుచేస్తున్న పోలీసు క్యాంప్‌లపై మావోలు మెరుపుదాడికి దిగారు. పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మారం, చింతవాగులో నిర్మించిన క్యాంప్‌లు, పామేడు పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టులు దాడికి దిగారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో లాంచర్లతో దాడిని ప్రారంభించిన మావోయిస్టులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగించారు. సీఆర్పీఎఫ్ బలగాలు ఎదురుదాడికి దిగగా తెల్లవార్లూ ఆ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 300 నుంచి 400 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఆయా ప్రాంతాల ప్రధాన దారులపై చెట్లు నరికి అడ్డంగా వేసి నిప్పుపెట్టి రహదారిని మూసి వేశారు. ఆ మార్గాల గుండా వస్తున్న గ్రామస్తులను వెనక్కి పంపించారు. మూడు చోట్లా ఏకకాలంలో రాకెట్ లాంచర్లు విసురుతూ, మందుపాతరలు పేల్చుతూ భయోత్పాతం సృష్టించారు. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు సైతం ఎదురుదాడికి దిగాయి. ధర్మారం క్యాంపు నిర్మాణ పనులు కొనసాగుతుండగా అందులోని జవాన్లతో పాటు పని చేసేందుకు గుంటూరు నుంచి వచి్చన 40 మంది కూలీలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ధర్మారం క్యాంప్‌పై జరిపిన దాడిలో తొమ్మిది మంది జవాన్లు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కొత్తపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు తీవ్రంగా గాయపడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కొత్తపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న శిబిరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. వెంటనే తేరుకున్న మావోయిస్టులు ఎదురుకాల్పులు జరుపుతూ సమీప అటవీప్రాంతంలోకి పారిపోయినట్టు సమాచారం. పోలీసులు మావోల క్యాంప్‌ను ధ్వంసం చేశారు. ఘటనాస్థలిలో భారీగా పేలుడు పదార్థాలను స్వా«దీనం చేసుకున్నారు. ‘‘మావోల జాడ కోసం గాలింపు చేపట్టగా సమీప ప్రాంతాల్లో రక్తపు మరకలు ఎక్కువగా కనిపించాయి. ఎన్కౌంటర్ సందర్భంగా దాదాపు ఆరుగురు మావోలు తీవ్రంగా గాయపడి ఉండొచ్చు లేదా మరణించి ఉండొచ్చు ఉండొచ్చు’’ అని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల ఘటనలో సీఆర్పీఎఫ్ 165వ బెటాలియన్ ఎస్ఐ సుధాకర్‌రెడ్డి వీరమరణం పొందగా రాము అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో బద్రేలోని సీఆర్పీఎఫ్ క్యాంపు నుంచి ఉర్సంగల్ వైపు జవాన్లు కూంబింగ్ సాగిస్తున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్సై సుధాకర్‌రెడ్డి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. సుధాకర్‌రెడ్డి సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు. ఈ నెలలో బస్తర్ డివిజన్లో మావోయిస్టుల సంబంధిత ఘటనల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గాయపడ్డారు. 13న నారాయణ్‌పూర్ జిల్లా మావోయిస్టుల దాడిలో ఒక జవాను, 14న కాంకేర్ జిల్లా నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి మరో బీఎస్ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు. -
సుకుమా అడవుల్లో ఎన్కౌంటర్ ఇద్దరు మావోయిస్టులు మృతి
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా కుంట పరిధిలోని కన్హాయిగూడ– గోపాండ్ అటవీ ప్రాంతంలో నక్సలైట్లు, భద్రతా బలగాల నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్టు సుకుమా జిల్లా ఎస్పీ సునీల్‌శర్మ ధ్రువీకరించారు. డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం గాలింపు చేపట్టగా, భద్రతా బలగాలను గమ నించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. భద్రతా బలగాలు తేరుకుని జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో కుంట ఎల్ఓఎస్ కమాండర్ కవ్వాసి ఉంగా, జన మిలీషియా కమాండర్ సోయం బజారి ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కవ్వాసిపై రూ.5 లక్షలు, సోయంపై రూ.లక్ష రివార్డు ఉందని పేర్కొన్నారు. కాగా, ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వెల్లడించారు. -
ఎన్కౌంటర్ : నలుగురు మావోయిస్టుల మృతి..!
భద్రాద్రి కొత్తగూడెం : దండకారణ్యంలో మరోసారి తుపాకులు గర్జించాయి. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో నలుగురు మవోయిస్టులు మృతిచెందారు. వారివద్ద నుంచి పోలీసులు రెండు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. ఘటనకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
దండకారణ్యంలో మారణకాండ
సాక్షి, సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి మారణహోమం సృష్టించారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై మంగళవారం మెరుపుదాడి చేసి 9 మందిని బలిగొన్నారు. సుక్మా జిల్లా కిష్టారాం - పలోడి ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలను నక్సలైట్లు శక్తిమంతమైన మందుపాతరలతో పేల్చివేశారు. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న కోబ్రా దళాల రాకను పసిగట్టి మవోయిస్టులు ఈ మెరుపు దాడికి దిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మందుపాతర పేలుడు నుంచి తేరుకునేలోపే మావోయిస్టులు కాల్పులకు దిగడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మందుపాతర దాడులను తట్టుకునే వాహనంలో ప్రయాణిస్తున్న జవాన్లు సైతం గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దాడిలో 100 మంది మవోయిస్టులు పాల్గొన్నారని అంచనా. మృతి చెందిన వారిలో..ఏఎస్సై ఆర్కేఎస్ తోమర్, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, కానిస్టేబుల్స్ అజయ్ కేఆర్ యాదవ్, మనోరంజన్ లంక, జితేంద్ర సింగ్, శోభిత్ శర్మ, మనోజ్ సింగ్, ధర్మేంద్ర సింగ్, చంద్ర హెచ్ఎస్ లు ఉన్నారు. -
13 మంది మావోయిస్టుల లొంగుబాటు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమ జిల్లా ఎస్పీ అభిషేక్‌మిన్నా ఎదుట సోమవారం మధ్యాహ్నం 13మంది మావోయిస్టులు లొంగిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. దళంలో చిన్న చూపు చూస్తున్నారు. గిరిజనుల కోసమే పోరాటం అంటూనే వారి కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్డుపనులను అడ్డుకుంటున్నారు. అగ్రనేతలు ప్రాణాలు కాపాడడం కోసం చిన్న కేడర్ నేతలను ముందు ఉంచి బలి చేస్తూ వారు తప్పించుకుంటున్నారు. మహిళా మావోయిస్టులకు దళంలో రక్షణ కరువైంది. వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. అందుచేతనే తాము మనస్తాపం చెందిన లొంగిపోతున్నమని మావోయిస్టులు ఎస్పీకి తెలిపారు. అలాగే తమ గిరిజనులపై ఇన్ఫార్మర్ల నెపం మోపి తమ చేతనే హత్యలు చేయిస్తున్నారని ఆవేదన చెందారు. మాకు ఇవి నచ్చడం లేదు..ప్రజాసేవ చేయాలంటే జనజీవనంలోకి వచ్చి చేస్తామన్నారు. అనంతరం ఎస్పీ అభిషేక్‌మిన్నా మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను త్వరలోనే వారికి అందజేస్తామని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులంతా దర్భ డివిజన్‌కు చెందినవారని తెలిపారు. -
కాల్పుల్లో నక్సలైట్ మృతి
ఛత్తీస్‌గఢ్: సుకుమా జిల్లాలో ఎన్కౌంటర్లో ఓ నక్సలైట్ మృతిచెందాడు. అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా నక్సల్స్ తారసపడ్డారు. దాంతో ఇరువురి మధ్య కాల్పులు చోటు చేసుకున్నారు. ఎదరుకాల్పుల్లో ఓ నక్సలైట్ మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు వివరాల కోసం తీస్తున్నారు. -
మందుపాతర పేలుడు : సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు
మావోయిస్టులు అమర్చిన మందుపాత పేలి ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘనట ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమాజిల్లాలో జరిగింది. మావోయిస్టులు మూడు రోజుల బంద్ పిలుపు ఇచ్చిన నేపద్యంలో.. జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో జవాన్లు లక్షంగా ఏర్పాటు చేసి మందుపాత పేలింది. గాయపడిన జవాన్లను వైద్యం కోసం తరలించారు. ఘటకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కందకాలు
బేస్ క్యాంప్‌కే పరిమితమైన బలగాలు దుమ్ముగూడెం: ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోని అటవీప్రాంతంలో పోలీసుల రాకపోకలను అడ్డుకోవడానికి మావోయిస్టులు కందకాలు తవ్వుతున్నట్లు తెలిసింది. ధర్మపేట ప్రధాన రహదారులను నిర్బంధించి శనివారం సాయంత్రం నుంచి మావోయిస్టు మిలీషియా సభ్యులు ఈ కందకాలను తవ్వుతున్నట్లు తెలిసింది. ఇదే ప్రాంతంలో ధర్మపేట బేస్ క్యాంప్ ఉన్నప్పటికీ కోయ కమాం డోలు అందుబాటులో లేకపోవడం తో సీఆర్పీఎఫ్ బలగాలు బయటకు రాకుం డా క్యాంప్‌నకే పరిమితమైనట్లు తెలుస్తోంది. గ్రామాల్లోకి పోలీసులను రానివ్వవద్దని, బేస్ క్యాంపుల నిర్మాణాలను అడ్డుకోవాలని, సంతలను బంద్ చేయాలని, సరుకులను సరఫరా చేయొద్దని ఆయా ఆదివాసీ గ్రామాల ప్రజలకు మావోయిస్టులు సూచనలు చేశారు. -
సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌పై మావోల మెరుపుదాడి
ఖమ్మం : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సుకుమా జిల్లా తమెళ్వాడలోని సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టులు బుధవారం మెరుపు దాడి చేశారు. మావోయిస్టులకు, భద్రతా దళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు మావోయిస్టుల దాడిని భద్రతా దళాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. కాగా ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడిత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఊపిరి పీల్చుకున్న భద్రతా దళాలపై మావోలు దాడికి పాల్పడుతున్నారు. సుక్మా జిల్లాలో ఎన్నికల విధులు ముగించుకుని తిరిగి వస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు లక్ష్యంగా మావోయిస్టులు పేల్చి మందుపాతరలో ఇద్దరు జవాన్లు, ఓ వాహన డ్రైవర్ మృతి చెందారు.