నృసింహుని సన్నిధిలో ‘కాటమరాయుడు’ నిర్మాత | maratsarar in kadiri narasimha temple | Sakshi
Sakshi News home page

నృసింహుని సన్నిధిలో ‘కాటమరాయుడు’ నిర్మాత

Published Wed, Mar 22 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

maratsarar in kadiri narasimha temple

కదిరి అర్బన్‌ : స్థానిక ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని బుధవారం ‘కాటమరాయుడు’ చిత్ర నిర్మాత శరత్‌మరార్‌, టీటీడీ మెంబర్‌ హరిప్రసాద్‌ దర్శించుకున్నారు. ఈమేరకు ఆలయ పూజారులు, సిబ్బంది వారికి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో పలువురు పవన్‌కల్యాణ్‌ అభిమానులు పాల్గొన్నారు. అనంతరం చిత్రనిర్మాత శరత్‌మరార్‌ మాట్లాడుతూ దేవుడి ఆశీర్వాదంతో ‘కాటమరాయుడు’ సినిమాను బాగా తీయగలిగామన్నారు.

సినిమాకు టైటిట్‌ కూడా బాగా కుదిరిందని చెప్పారు. అందుకే దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్లాలని దర్శించుకునేందుకు  వచ్చామన్నారు. సినీనటుడు పవన్‌కల్యాణ్‌ కూడా త్వరలోనే కదిరి నృసింహున్ని దర్శించుకుంటారని చెప్పారు. అనంతరం పవన్‌ అభిమానులు నిర్మాతను పూలమాలతో సన్మానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement