ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ వాటర్‌ప్రూఫ్ కార్మికులు ట్రేడర్స్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వివరాలు... నాగోలు జైపురికాలనీకి చెందిన అబ్బు నాగోలు చౌరస్తాలోని రాజరాజేశ్వరి ట్రేడర్స్ నిర్వాహకుడు సతీష్‌గుప్తా అబ్బును లాలాపేటలో నిర్వహించే బహుళ అంతస్తుల వద్దకు వాటర్ ప్రూఫింగ్ కోసం తీసుకెళ్లాడు.
ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా పనులు చేయించాడు. పని చేస్తుండగా ప్రమాదవశాత్తు అబ్బు కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అబ్బును కాచిగూడలోని సాయికృష్ణ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన నిర్వాహకుడు సతీష్‌గుప్తాను నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ వాటర్‌ప్రూఫ్ అసోసియేషన్ సభ్యులు, ఎంఆర్‌పీఎస్ నాయకులు సోమవారం నాగోలులోని కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ నాయకులు చెర్కు ప్రశాంత్‌గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని నష్టపరిహారం చెల్లించాలని చెప్పడంతో త్వరలో పరిహారం చెల్లిస్తానని నిర్వాహకుడు ఒప్పుకున్నాడు.