అల్లదుర్గం (మెదక్) : కడుపు నొప్పి భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం నాగులపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సుఖలత(25) గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం నొప్పి ఎక్కువ కావడంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.