కుటుంబ కలహాల కారణంగా కమ్మం జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
టేకులపల్లి మండలం ముత్యాలపాడు పంచాయతీ పాత తండా గ్రామానికి చెందిన భూక్య లక్ష్మీ(20) అనే వివాహిత మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. భర్త ఆటో డ్రైవర్ . కుటుంబకలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోఉదచేసి దర్యాప్తు చేస్తున్నారు.