వివాహిత అనుమానాస్పద మృతి | married woman suspicued death | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Published Sun, Jul 3 2016 2:24 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

వివాహిత అనుమానాస్పద మృతి - Sakshi

వివాహిత అనుమానాస్పద మృతి

కుటుంబీకులే హత్య చేశారని ఆరోపణ
ఆగ్రహంతో ఆమె భర్తపై కత్తితో దాడి చేసిన బంధువులు

 బంట్వారం: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన శనివారం మండల పరిధిలోని కొత్తపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ మండలం పీలారం గ్రామానికి చెందిన లక్ష్మి(30)ని పదిహేనేళ్ల క్రితం గ్రామానికి చెందిన నర్సింహ్మారెడ్డి వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్లుగా దంపతులు కుటుంబ కలహా లతో గొడవపడుతున్నారు. ఈనేపథ్యం లో ఇటీవల లక్ష్మి వికారాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో భర్త పై కేసు పెట్టింది.

పెద్దలు జోక్యం చేసుకుని రాజీకుదిర్చా రు. అయినా దంపతులు గొడవపడుతూనే ఉన్నారు.ఇదిలా ఉండగా, లక్ష్మి శుక్రవారం రాత్రి ఇంట్లోఎవరూలే ని సమయంలో అనుమానాస్పదస్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మి ని కుటుంబీ కులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారనిమృతి రాలి తల్లిదండ్రులు సత్యనారాయణరెడ్డి, ఈశ్వరమ్మ ఆరోపించారు. ఈమేరకు పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. లక్ష్మి ఉరి వేసుకుం దని ఎస్‌ఐ హన్మానాయక్ తెలిపారు.

ఇరువర్గాల ఘర్షణ..
లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈక్రమంలో శనివారం కొత్తపల్లిలో ఇరువర్గాల వారు దాడులకు పాల్పడ్డారు. మృతురాలి భర్త నర్సింహ్మారెడ్డి కత్తిపోట్లకు గురయ్యాడు. మోమిన్‌పేట సీఐ ఏవీ రంగా గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహానికి మర్పల్లి ప్రభు త్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉందని ఎస్‌ఐ హన్మానాయక్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement