- 26 మంది సీఆరీ్పఎఫ్ జవాన్లు మృతి
- మాటు వేసి కాటేసిన మావోయిస్టులు
- నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో అప్రమత్తం
- అదనపు బలగాలతో కూంబింగ్ ముమ్మరం
పేలిన మావో తూటా
Published Mon, Apr 24 2017 11:36 PM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM
పచ్చని ప్రకృతి ఒడిలో తుపాకీ పేలింది... దట్టమైన అడవిలో అలజడి రేగింది. ఆర్తనాదాలు ... విప్లవ నినాదాలతో కొండ ప్రాంతం మార్మోగిపోయింది. ఈ సారి సీఆరీ్పఎఫ్ జవాన్లు నేలకొరిగారు. కూంబింగ్‌లో భాగంగా ముందుకు సాగుతుండగా మందుపాతర పేలింది ... ఆ వెంటనే కాల్పులు ప్రారంభమవడంతో 26 మంది కన్నుమూశారు. తేరుకునేలోగానే తుపాకీ గుళ్ల వర్షం కురవడంతో పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం వాటిల్లింది.
చింతూరు (రంపచోడవరం) :
సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్‌మా జిల్లాలో సోమవారం సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి ఘటనతో ఆంధ్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల దాడిలో సీఆరీ్పఎఫ్‌కు చెందిన 26 మంది జవాన్లు మృతిచెందగా ఏడుగురు గాయపడ్డారు. మరో 8 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. హై అలర్ట్‌లో భాగంగా ఆంధ్రాకు ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణా సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. ఘటనకు పాల్పడిన మావోయిస్టులు సేఫ్‌జో¯ŒS కోసం ఆంధ్రా సరిహద్దుల వైపు వచ్చే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పోలీస్‌స్టేష¯ŒS పరిధిలోని మల్లంపేట సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని మైతా, దుర్మా, గోంపాడు, సింగారం ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకునే అవకాశముంది. ఈ ప్రాంతం మావోయిస్టులకు పెట్టనికోటగా చెప్పవచ్చు. ఈ ప్రాంతాన్ని షెల్టర్‌జో¯ŒSగా చేసుకుని మావోయిస్టులు అటు ఛత్తీస్‌గఢ్‌లో, ఇటు ఆంధ్రాలో పలు సంఘటనలకు పాల్పడిన ఉదంతాలున్నాయి. నాలుగు రాష్టాల సరిహద్దుల్లోని ఎటపాక, ఏడుగురాళ్లపల్లి, చింతూరు, మోతుగూడెం, డొంకరాయి, సీలేరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీసులను అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది.
కూతవేటు దూరంలోనే...
ఆంధ్రా సరిహద్దులకు కూతవేటు దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని చింతగుహ, చింతల్‌నార్, తాడిమెట్ల ప్రాంతాల్లో మావోయిస్టులు ఆనేక భారీ ఘటనలకు పాల్పడ్డారు. 2010లో 76 మంది సీఆరీ్పఎఫ్ జవాన్ల ఊచకోత, 2009 జూలై 12న రాజ్‌నంద్‌గావ్‌లో 29 మంది, నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన దాడిలో 27 మంది జవాన్లు బలయ్యారు. 2007 ఆగస్టులో తాడిమెట్ల వద్ద దాడిలో 12 మంది, ఎర్రబోరు వద్ద దాడిలో 23 మంది మృత్యువాత పడ్డారు. 2005 బీజాపూర్ జిల్లా గంగలూర్ వద్ద దాడిలో 23 మంది మృతిచెందగా, 2014 మార్చి 11న టహక్‌వాడ వద్ద జరిగిన దాడిలో 16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
మావోల ఉచ్చులో జవాన్లు...
మావోయిస్టులు తమ టెక్నికల్ కౌంటర్ ఎటాక్‌లో భాగంగా వేస్తున్న ఉచ్చు (అంబుష్)లో సీఆరీ్పఎఫ్ జవాన్లు ఇరుక్కుని తమ ప్రాణాలు కోల్పోతున్నారని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నా పదేపదే అవే సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. కూంబింగ్ లేదా రోడ్ ఓపెనింగ్ విధులకు వెళ్లేటప్పుడు వెళ్లిన దారిలోనే రావడం, వాహనాలు ఎక్కడం, గుంపుగా నడవడం నిషిద్ధమైనా జవాన్లు వాటిని ఆచరించక మావోల దాడులకు బలవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటనలో సైతం గ్రామీణుల వేషధారణలో ఉంటూ జవాన్ల రాకపోకలను పసిగట్టిన మావోయిస్టులు అదనుచూసి దాడికి పాల్పడ్డారు. ఇటీవలి కాలంలో విలీన మండలాల్లోని చింతూరు, ఎటపాక మండలాల్లో సైతం మావోయిస్టులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇ¯ŒSఫార్మర్ల నెపంతో చింతూరు మండలం లచ్చిగూడెంకు చెందిన పాస్టర్ వుయికా మారయ్య, నర్శింగపేటకు చెందిన పర్శిక పుల్లయ్యలను మావోయిస్టులు హతమార్చారు. దీంతోపాటు చింతూరు మండలంపేగ, అల్లిగూడెం, ఏడుగురాళ్లపల్లిల నడుమ పలుచోట్ల పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర్లు అమర్చడంతోపాటు చెట్లను నరకడం, కందకాలు తవ్వి రహదారులను దిగ్బంధనం చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఇటీవల చింతూరు మండలం బొడ్డుగూడెం వద్ద మందుపాతర అమర్చే క్రమంలో ఇద్దరు దళసభ్యులు మృతిచెందగా కాక కన్నయ్య అనే దళసభ్యుడు కాలు కోల్పోయి పోలీసుల చేతికి చిక్కాడు.
Advertisement