పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు
Published Wed, Jan 25 2017 4:25 PM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM
హైదరాబాద్: తెలంగాణ సరిహద్దు మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. గడ్చిరోలి జిల్లా కంతాలా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టుల సంచారంపై విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం గడ్చిరోలి పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడ్డారు. రెండు వర్గాల మధ్య పరస్పరం కాల్పులు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చేపట్టగా ఆహారపదార్థాలు, విప్లవసాహిత్యం లభించాయి. ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Advertisement
Advertisement