న్యూఢిల్లీ:చత్తీస్ గఢ్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై నక్సల్స్ జరిపిన దాడిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఖండించారు. సోమవారం సుక్మా జిల్లాలోని దట్టమైన చింతగుహ అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దాడిపై రాష్ట్రపతితో ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్రంగా ఖండించారు. నక్సల్స్ విచక్షణారహితంగా దాడులు జరిపి 13 మందికి కారణమవ్వడంతో తాను షాక్ గురైనట్లు రాష్ట్రపతి తెలిపారు. ఈ తరహాలో నక్సల్స్ హింసకు పాలడటం ఎంత మాత్రం సరికాదని ఆయన సూచించారు.
నక్సల్స్ సాధారణ ప్రజలను రక్షణ కవచాలుగా వాడుకుని సీఆర్‌పీఎఫ్ బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 13 మంది జవాన్ల మృతికి కారణమయ్యారు. ఆ దాడిలో మరో 15 మంది జవాన్లు గాయపడ్డారు.
సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని ఖండించిన రాష్ట్రపతి
Published Tue, Dec 2 2014 10:19 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement