వార్డుమెంబర్ల కుటుంబాలకు రాయితీపై వైద్యం | medical reembersment to vardmembers | Sakshi
Sakshi News home page

వార్డుమెంబర్ల కుటుంబాలకు రాయితీపై వైద్యం

Published Sat, Sep 3 2016 9:33 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

medical reembersment to vardmembers

  • సౌమ్య మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు 
  • ముకరంపుర: జిల్లాలోని వార్డుమెంబర్లు, వారి కుటుంబాలకు 40 శాతం రాయితీపై వైద్యసేవలందించనున్నట్లు కరీంనగర్‌ సౌమ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్వాహకుడు డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. శనివారం కరీంనగర్‌లోని ప్రెస్‌భవన్‌లో గైనకాలజిస్ట్‌ స్రవంతి, పీడియాట్రిస్ట్‌ అవినాష్‌తో పాటు తెలంగాణ గ్రామపంచాయతీ వార్డు మెంబర్ల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపకుడు మహంకాళి శ్రీనివాస్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వార్డు మెంబర్లు ఎంతో కృషి చేస్తారన్నారు. హెల్త్‌కార్డుదారులైన వార్డుమెంబర్ల కుటుంబాలకు రాయితీపై వైద్యం అందిస్తామన్నారు. సమావేశంలో వార్డుమెంబర్ల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సతీష్, శంకరయ్య పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement