cheking
-
హోంమంత్రి వాహనం తనిఖీ.. సహకరించిన మంత్రి
కొత్తకోట రూరల్: వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహిస్తున్న మైనార్టీ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ వాహనాన్ని పెద్దమందడి మండలం వెల్టూర్ స్టేజీ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద బుధవారం ఎస్ఐ హరిప్రసాద్ తనిఖీ చేశారు. పోలీసులు వాహనాన్ని ఆపడంతో హోం మంత్రి దిగి పోలీసులకు సహకరించారు. వాహనాన్ని పరిశీలించి పంపించారు. తనిఖీల్లో నగదు సీజ్ నారాయణపేట రూరల్: మండలంలోని జలాల్పూర్ చెక్‌పోస్టు వద్ద తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులకు ఒక వాహనంలో రూ.90,500నగదు గుర్తించినట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. అక్కడ విధుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ వేమన ఆధ్వర్యంలో వాటిని సీజ్ చేసి గ్రీవియన్ కమిటీకి పంపించినట్లు తెలిపారు. కొత్తకోట రూరల్: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. బుధవారం పెద్దమందడి మండలం మోజర్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో వాహనాలను తనిఖీ చేస్తున్నండగా హైదరాబాద్ నుంచి వనపర్తి వెళ్తున్న పుల్లయ్య కారును అపి తనిఖీ చేయడంతో రూ.1,10,000 నగదు లభించింది. నగదుకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా కామారెడ్డి నుంచి వనపర్తికి కారులో వెళ్తున్న రాజు నుండి రూ.50,500 నగదు లభించింది. ఎలాంటి అనుమతులు లేకపోడంతో సీజ్ చేసినట్టు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు.. కలెక్టర్
వనపర్తి: ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ తేజస్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నోడల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సర్వేలెన్స్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికల విధులపై సూచనలు చేశారు. జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సర్వేలెన్స్ బృందాల బాధ్యతలను వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తుందన్నారు. జిల్లాలో 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటాయని, జిల్లా నలుమూలల చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి నిఘా పెంచినట్లు తెలిపారు. అక్రమంగా డబ్బు, మద్యం సరఫరా చేస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బహుమతులు ఇవ్వడం లాంటివి నియంత్రించాలని ఆదేశించారు. సి–విజిల్ యాప్‌తో గాని టోల్‌ఫీ నంబర్ 1950, కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేస్తే 15 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకునేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలని.. స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్ చురుగ్గా పని చేయాలని సూచించారు. రూ.50 వేల కన్నా అధికంగా పట్టుబడితే వెంటనే సీజ్ చేయాలన్నారు. రూ.10 లక్షల వరకు సరైన ఆధారాలు ఉంటే సీజ్ చేయబోమని.. ఇన్‌కం టాక్స్ వారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఎక్కువ విలువ గల వస్తువులు గుర్తిస్తే వీడియో కవరేజ్ చేస్తూ సీజ్ చేయాలని ఆదేశించారు. ఓటర్లను భయభ్రాంతులు, ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీ ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు. -
కోడ్ కూయక ముందే సరిహద్దులో తనిఖీ కేంద్రాలు..
మంచిర్యాల : రానున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేదుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కార్యచరణకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల కోసం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. జిల్లా సరి హ ద్దు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశా రు. మంచిర్యాల–జగిత్యాల, జిల్లాల సరిహ ద్దు ప్రాంతమైన దండేపల్లి మండలం గూడెం అటవీ చెక్‌పోస్టు వద్ద, దండేపల్లి పోలీసులు తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. వచ్చి పోయే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మద్యం, డబ్బు, ఓటర్లను ప్రలోభ పె ట్టేందుకు తరలించే వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టి, తనిఖీలు ముమ్మరం చేశారు. గతంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చాక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారీ మాత్రం ముందుగానే తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం. -
ఈసీ సస్పెన్షన్ ఆర్డర్‌పై క్యాట్ స్టే
బెంగళూరు: ఒడిశాలో ప్రధాని మోదీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసినందుకు మహ్మద్ మొహ్సిన్ అనే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) గురువారం స్టే విధించింది. కర్ణాటక కేడర్‌కు చెందిన మొహ్సిన్ను ఒడిశాలో ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా నియమించగా, ఆయన మోదీ హెలికాప్టర్‌ను సంబాల్పూర్లో తనిఖీ చేయడం, అది నిబంధనలకు విరుద్ధం అంటూ ఈసీ మొహ్సిన్‌పై సస్పెన్సన్ వేటు వేయడం తెలిసిందే. ఎస్పీజీ రక్షణ కలిగిన వారి హెలికాప్టర్లను తనిఖీ చేయకూడదని ఎన్నికల సంఘం పేర్కొనగా, అలాంటిదేమీ లేదని క్యాట్ తాజాగా వెల్లడించింది. విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. కాగా, ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను మాత్రం ఈసీ ఎత్తివేసింది. -
మార్కెట్ కార్యదర్శి ఆకస్మిక తనిఖీ
వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి పొలెపాక నిర్మల గురువారం మిర్చి యార్డును ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యదర్శిని చూడగానే చిల్లర దొంగలు దొంగలించిన మిర్చి బస్తాలను వదిలివేసి పారిపోయారు. అప్పటికి సెక్యూరిటీ గార్డులు అందుబాటులో లేకపోయో సరికి కార్యదర్శినే స్వ యంగా దొంగ బస్తాలను యార్డులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న యార్డు ఇంచార్జీలు జన్ను భాస్కర్, బీ.వెంకన్న, సెక్యూరిటీ గార్డులు కార్యదర్శి వద్దకు చేరుకొని తనిఖీలో పాల్గొన్నారు.అనంతరం యార్డు ఏఎస్.వేముల వెంకటేశ్వర్లు దగ్గరుండి కార్యదర్శికి సహకరిస్తూ..చిల్లర దందాగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. సెక్యూరిటీ గార్డులు సరిగా విధులు నిర్వర్తించడం లేదని కార్యదర్శి వారిపై అసహనం వ్యక్తం చేశారు. మరోసారి చిల్లర దొంగలు, వ్యాపారులు మిర్చి దందా చేస్తున్నట్లు తన దృష్టికి వస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని హెచ్చరించారు. బస్తాలు దొరికిన చిల్లర దొంగలు తమ బస్తాలను తీసుకెళ్లడానికి వివిధ రకాలుగా ఫైరవీలు చేసినా కార్యదర్శి ససేమీరా ఒప్పుకోలేదు. తనిఖీలో స్వా« దీనం చేసుకున్న 1.38 క్వింటాళ్ల మిర్చిని యార్డులోనే అమ్మి, మార్కెట్ ఫీజు కింద జమచేశారు. రైతులను ఇబ్బంది పెడితే సహించం.. మార్కెట్‌కు మిర్చి అమ్మకానికి వచ్చిన రైతులను మునీమ్, దానం, దయ పేరుతో మిర్చిని తీసుకోవడానికి ఇబ్బంది పెడితే సహించేదిలేదని మార్కెట్ కార్యదర్శి పి.నిర్మల హమాలీ కార్మికులను హెచ్చరించారు. గురువారం మిర్చి మార్కెట్లో కార్యదర్శి అకస్మిక తనిఖీ నిర్వహించిన సమయంలో కొందరు హమాలీల వద్ద చిల్లర మిర్చి బస్తాలను గుర్తించిన కార్యదర్శి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. హమాలీలు సక్రమంగా డ్యూటీ చేయాలని, లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. -
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
బోథ్(ఆదిలాబాద్) : అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు సక్రమంగా అందుతాయని కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. మండలంలోని వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో స్థానిక పరిచయ గార్డెన్లో మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ఆయా శాఖల అధికారులు నివేదికలు చదివి వినిపించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు వివరించగా త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో రైతుల కోసం కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్1800–120–3244కు ఫోన్ చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, రుణాల వంటి సమస్యలను తెలియజేయవచ్చన్నారు. ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ఎంపీడీవో, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు గ్రామపంచాయతీ 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను వెచ్చించాలన్నారు. మండలంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికారుల కృషి చేయాలన్నారు. జిల్లాలో జైనథ్, బోథ్, ఇచ్చోడ, బేల, ఆదిలాబాద్ మార్కెట్లలో శెనగ కొనుగోలు కేంద్రాలను వారం రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రాజేశ్వర్, ఎంపీపీ గంగుల లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు బండారు సాయమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల శారద, బోథ్ సర్పంచ్ మంగారపు సునీత, తహసీల్దార్ దుర్వ లక్ష్మణ్, ఎంపీడీవో బి.అప్పారావ్, వ్యవసాయాధికారి భాస్కర్, ఎఫ్ఆర్వో మనోహర్, రైతు సమసన్వయ సమితి అధ్యక్షుడు రుక్మణ్‌సింగ్, వివిధశాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆసుపత్రి తనిఖీ అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ గది నిర్మాణం పూర్తి కాకపోవడంతో సంబంధిత ఈఈతో ఫోన్లో మాట్లాడి సత్వరం పూర్తయ్యేలే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వార్డులను పరిశీలించారు. రోగులకు మెరుగైన సేవలందించాలని వైద్యులకు సూచించారు. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలి బజార్హత్నూర్(బోథ్): గ్రామాల్లో ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వివరించగా.. పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రాథోడ్, జెడ్పీటీసీ మునేశ్వర్ నారాయణ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అల్కే గణేశ్, జిల్లా సభ్యులు చిల్కూరి భూమన్న, సహకార సంఘం చైర్మన్ తురాటి భోజన్న, వైస్ ఎంపీపీ శ్రీమతి, సర్పంచ్‌లు సాయన్న, భాస్కర్‌రెడ్డి, విద్యాసాగర్, రాధ, భీంబాయి, పద్మ, రేణుక, కైలాస్, రాజు, ఎంపీటీసీలు నారాయణ, గంగాప్రసాద్, తహసీల్దార్ రాజేందర్‌సింగ్, ఎంపీడీవో శంకర్, ఏవో ప్రమోద్‌రెడ్డి పాల్గొన్నారు. కస్తూరిబా పాఠశాల, పీహెచ్సీ తనిఖీ మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎస్వో సెలవుపై ఉండడంతో పర్యవేక్షణ కరువైందని చెప్పగా రెగ్యూలర్ ఎస్వోను నియమిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేశారు. ప్రసుతి గది, రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. ఆసుపత్రి ప్రహరీకి నిధులు కేటాయిస్తానని తెలిపారు. -
వార్డుమెంబర్ల కుటుంబాలకు రాయితీపై వైద్యం
సౌమ్య మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు ముకరంపుర: జిల్లాలోని వార్డుమెంబర్లు, వారి కుటుంబాలకు 40 శాతం రాయితీపై వైద్యసేవలందించనున్నట్లు కరీంనగర్ సౌమ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శనివారం కరీంనగర్‌లోని ప్రెస్‌భవన్‌లో గైనకాలజిస్ట్ స్రవంతి, పీడియాట్రిస్ట్ అవినాష్‌తో పాటు తెలంగాణ గ్రామపంచాయతీ వార్డు మెంబర్ల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపకుడు మహంకాళి శ్రీనివాస్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వార్డు మెంబర్లు ఎంతో కృషి చేస్తారన్నారు. హెల్త్‌కార్డుదారులైన వార్డుమెంబర్ల కుటుంబాలకు రాయితీపై వైద్యం అందిస్తామన్నారు. సమావేశంలో వార్డుమెంబర్ల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సతీష్, శంకరయ్య పాల్గొన్నారు. -
‘ప్రైవేట్’లో టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీలు
పెన్‌పహాడ్ : మండలంలోని అనంతారం, నాగులపాటి అన్నారం, చీదెళ్ల గ్రామాలతోపాటు మండల కేంద్రంలోని శ్రీ అరబిందోమాత, అక్షర, స్నేహ, శ్రీ వాగ్ధేవి ప్రైవేట్ పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ అధికారులు పి.రాధాసింగ్, డి.వీరయ్య మాట్లాడుతూ అర్హత కలిగిన వారినే ఉపాధ్యాయులుగా నియమింపజేయాలని.. సరైన వసతులు కల్పించాలని, ఆట స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై ప్రభుత్వపరంగా చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు రామాంజనేయులు, శంకర్, పాఠశాలల కరస్పాండెంట్లు నాగయ్య, షేక్ మస్తాన్, సైదులు పాల్గొన్నారు.