‘ప్రైవేట్‌’లో టాస్క్‌ఫోర్స్‌ అధికారుల తనిఖీలు | taskfors cheking in pvt schools | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్‌’లో టాస్క్‌ఫోర్స్‌ అధికారుల తనిఖీలు

Published Sat, Jul 30 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

‘ప్రైవేట్‌’లో టాస్క్‌ఫోర్స్‌ అధికారుల తనిఖీలు

‘ప్రైవేట్‌’లో టాస్క్‌ఫోర్స్‌ అధికారుల తనిఖీలు

పెన్‌పహాడ్‌ : మండలంలోని అనంతారం, నాగులపాటి అన్నారం, చీదెళ్ల గ్రామాలతోపాటు మండల కేంద్రంలోని శ్రీ అరబిందోమాత, అక్షర, స్నేహ, శ్రీ వాగ్ధేవి ప్రైవేట్‌ పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం  టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పి.రాధాసింగ్, డి.వీరయ్య మాట్లాడుతూ అర్హత కలిగిన వారినే ఉపాధ్యాయులుగా నియమింపజేయాలని.. సరైన వసతులు కల్పించాలని, ఆట స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై ప్రభుత్వపరంగా చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు రామాంజనేయులు, శంకర్, పాఠశాలల కరస్పాండెంట్‌లు నాగయ్య, షేక్‌ మస్తాన్, సైదులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement