- పరస్పర దాడిలో ఒకని మృతి
- నిబంధనలు పట్టించుకోని మద్యం వ్యాపారులపై స్థానికుల ఆగ్రహం
ఉసురు తీసిన మత్తు
Published Thu, Feb 2 2017 11:25 PM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM
కాకినాడ క్రైం :
మద్యం మత్తులో ఇద్దరి మధ్య తలెత్తిన వాగ్వాదం కత్తిపోట్లకు దారి తీసి ఒకరిని పొట్టనపెట్టుకోగా ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యాడు. కాకినాడలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. టూటౌ¯ŒS పోలీస్‌స్టేçÙ¯ŒS సమీపంలోని చినమార్కెట్‌కు చెందిన బోరా వెంకట యల్లయ్య (30) పెయింటర్‌గా పని చేస్తుంటాడు. స్థానిక కొత్తపేట మార్కెట్ ఎదురుగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌కు అప్పుడప్పుడు వెళ్లి మద్యం సేవిస్తుంటాడు. మంగళవారం బార్‌కు వెళ్లాడు. అక్కడకు జగన్నాథపురం అన్నమ్మఘాటీ సెంటర్‌కు చెందిన వడ్డాది సుధీర్ (28) కూడా వచ్చి మద్యం తాగాడు. మద్యం మత్తులో వీరిద్దరి మధ్య చోటుచేసుకున్న స్వల్ప వాగ్వాదం కత్తిపోట్లకు దారి తీసింది. దీంతో నిర్వాహకులు ఇరువురికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపేశారు. బుధవారం రాత్రి కూడా యల్లయ్య, సుధీర్ అక్కడకు వచ్చి మద్యం తాగి తిరిగి వెళ్లిపోతున్న క్రమంలో రాత్రి 11.30 గంటల మధ్య వాగ్వాదం చేసుకుని శృతి మించి వెంట తెచ్చుకున్న కత్తులతో ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో యల్లయ్య తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే జీజీహెచ్‌కు తరలించగా వైద్యం పొందుతూ అదే రోజు మృతి చెందాడు. సుధీర్‌కు చేతి, పొట్టమీద కత్తిపోట్లు పడడంతో వైద్యం కోసం జీజీహెచ్‌లోకి చేర్చారు. యల్లయ్యకు భార్య లోవలక్ష్మి, ఆరేళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్నారు. భర్త మరణంతో నడిరోడ్డున పడ్డామని, తమను ఎవరు ఆదుకుంటారని విలపించారు. సుధీర్ డిగ్రీ చదువుకుని ఖాళీగా ఉండి స్నేహితులతో కలసి తిరుగుతూంటాడు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఉమర్ తెలిపారు. నిందితుడు సు«ధీర్ డిశ్చార్జి కాగానే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
నిబంధనల మేరకు రాత్రి 10 గంటలకు బార్ అండ్ రెస్టారెంట్ మూసివేయాల్సి ఉండగా, ఎక్సైజ్‌శాఖ, పోలీస్‌లు పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు వాటిని తెరిచి ఘర్షణలకు కారణమవుతున్నారని స్థానికులు ఆరోపించారు.
Advertisement
Advertisement