మట్టి మనుషులు
మట్టి మనుషులు భూమి తల్లితో మమేకమవుతున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయం పనుల్లో నిమగ్నమవుతున్నారు. పై దశ్యాలు జైపూర్ మండలంలో కనిపించినవి. జైపూర్ మండలంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. పొలం పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. మండలంలో జూన్ మొదటి వారం నుంచి ఇప్పటివరకు 494.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సుమారు 5వేల ఎకరాల్లో పత్తి, 7వేల ఎకరాల్లో వరి, మరో 3వేల ఎకరాల్లో కంది, పెసర తదితర పప్పుదినుసుల సాగును చేపట్టనున్నారు. ఇప్పటికే కలుపు తీయడం, ఎరువులు చల్లడం తదితర పనుల్లో బిజీ బిజీ గడుపుతున్నారు.
– జైపూర్