ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య
Published Fri, Apr 14 2017 12:20 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
అంబాజీపేట (పి.గన్నవరం) :
ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతోన్న ఒక వ్యక్తి అంబాజీపేట బస్టాండ్ సమీపంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం అమలాపురం రూరల్ మండలం బండారులంకకు చెందిన పిచ్చిక సత్య సింహద్రిఅప్పన (48) అంబాజీపేటలో ఒక స్వీటు షాపులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.రెండు రోజులుగా ఆ షాపును మూసివేశారు. బుధవారం రాత్రి షాపు వద్ద పని ఉందని ఇంటిలో చెప్పిన అతడు.. స్వీట్లు తయారు చేసే ప్రాంతంలో ఉరి వేసుకున్నాడు. గురువారం ఉదయం షాపు తీసేందుకు వచ్చిన కార్మికులు విషయాన్ని షాపు నిర్వాహకులకు తెలియజేశారు. దీంతో వారు పోలీసులకు, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రేమ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement