ఎస్సీ, ఎస్టీ కేసులో ఎస్పీని ముద్దాయిగా చేర్చాలి
Published Fri, Oct 28 2016 11:40 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
–హైకోర్టు న్యాయవాది పురుషోత్తంరెడ్డి
ఎమ్మిగనూరు : ఎస్సీ, ఎస్టీ కేసును తన పలుకుబడితో ఫాల్స్‌గా చిత్రీకరించిన జిల్లా ఎస్పీ రవికృష్ణను అదే కేసులో ముద్దాయిగా చేర్చాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తంరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం విశాల గార్డెన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దకడబూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బంగి వెంకటేశ్వర్లు అనే ఎరుకల కులస్తున్ని దూషించి, దాడి చేసిన సంఘటనలో అనుమయ్య అనే వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి (47/2016) కేసు నమోదయిందన్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ కేసులను విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక డీఎస్పీని నియమించినా జిల్లా ఎస్పీ మాత్రం ఆదోని డీఎస్పీచే విచారించి ఫాల్స్ కేసుగా మార్చారన్నారు. జరిగిన అన్యాయాన్ని వెంకటేశ్వరు నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. కమిషన్ ఆదేశాల మేరకు డీఐజీ రమణ మూర్తి కేసును రీ–ఓపెన్ చేసీ ఎస్సీ, ఎస్టీ కేసుల డీఎస్పీ మురళీధర్‌చే విచారణ చేపట్టాలని ఆదేశించారన్నారు.మురళీధర్‌కూడా దళితుడు కావటంతోనే కేసును ఆయనచే విచారించకుండా ఎస్పీ అవమానించారన్నారు. ఈ సంఘటనను రాయలసీమ ఐజీ దృష్టికి తీసుకుపోతామనీ, అటు తరువాత హైకోర్టులో పిల్ దాఖలు చేసి ఎస్పీని ఆరెస్టు చేయిస్తామన్నారు. సమావేశంలో బా«ధితుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Advertisement